Police cordon operation in jublee hills

hyderabad, hyderabad police, hyderabad traffic police, hyderabad traffic police challan, cyberabad traffic police challan, cyberabad police, hyderabad police vehicles, latest news, cordon operation, crimes, crininals, jublee hills, banjarahills, film nagar, play cards centers, prostitution, police, search operation, police checkings

west zone police done cordon search operation on jublee hills and banjara hills at friday midnight : hyderabad richest areas jublee hills and banjarahills shivered by police cordon search operations

జూబ్లీ, బంజారాహిల్స్ దిగ్బందించిన పోలిసులు

Posted: 09/27/2014 07:20 AM IST
Police cordon operation in jublee hills

హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు శుక్రవారం అర్ధరాత్రి పోలిసు బూట్ల చప్పుళ్ళతో వణికిపోయాయి. అర్ధరాత్రి పోలిసులు రెండు ప్రాంతాలను చుట్టుముట్టారు. కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా.., జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని పోలిసులు తనిఖీ చేశారు. సుమారు 250మంది పోలిసులు బృందాలుగా విడిపోయి కాలనీల్లోకి వెళ్ళారు. సామాన్యుల ఇళ్ళతో పాటు బడాబాబుల భవనాలను కూడా సోదా చేసినట్లు తెలుస్తోంది.

వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆద్వర్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఫిలింనగర్ లోని ఓ గెస్ట్ హౌజ్ తో పాటు, మరో మూడు చోట్ల పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో 65మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలతో సినీ ప్రముఖులు అర్ధరాత్రి కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే నగరంలో నేరాలు అదుపులోకి వచ్చేవరకు కార్డాన్ ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. మెట్రో పోలిసింగ్ లో భాగంగా పోలిసులు ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

కార్డాన్ ఎలా..

ఈ కార్డాన్ పోలిసింగ్ విధానం విదేశాల నుంచి తీసుకున్నారు. విదేశాల్లో నేరాలను అదుపు చేయటంలో.., నేరస్తులను పట్టుకోవటంలో ఈ విధానం చాలా బాగా పనిచేసింది. కార్డాన్ సెర్చ్ లో పోలిసులు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. రహస్యంగా.., ఆకస్మికంగా అర్దరాత్రి ఆ ప్రాంతం రోడ్లన్ని మూసివేస్తారు. ఎంపిక చేసుకున్న ప్రాంతం నుంచి ఎవరిని బయటకు వెళ్లనివ్వరు.., అదే విధంగా లోపలికి కూడా ఎవరూ రాకుండా ప్రతి రోడ్డును.., చిన్నచిన్న గళ్ళీలను కూడా మూసివేస్తారు. కాలనీల చుట్టు పోలిసులు పహారాకాస్తుండగా.., వందల సంఖ్యలో ఉండే మిగతా పోలిసులు బృందాలుగా విడిపోయి.., ప్రతి ఇంటికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తారు.

ఇలా చేయటం వల్ల ఇళ్లలో ఉన్న నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉండదు.. వివిధ కేసుల్లో నిందితులుగా, అనుమానితులుగా ఉన్నవారు రాత్రి సమయంలో ఇంట్లోనే ఉండటంతో వారిలో చాలావరకు ఈ తనిఖీల్లో పోలిసులకు దొరికిన సందర్బాలు ఉన్నాయి. నగరంలో తొలి సారిగా పహాడి షరీఫ్ ప్రాంతంలోని స్నేక్ గ్యాంగ్ ఉండే సమీప ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. ఆ తర్వాత మాంగర్ బస్తీలో రెండ్రోజుల క్రితం కూడా కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆపరేషన్లు జరుగుతాయి.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hydeabad  jublee hills  banjarahills  police  

Other Articles