Bjp shiv sena party alliance finally cut after 25 years

bjp party, shiv sena party, bjp shiv sena party, bjp party leaders, maharashtra bjp leaders, shiv sena party leaders, congress party leaders, bjp shiv sena alliance, bjp chief amit shah, shiv sena party president uddhav thakre

bjp shiv sena party alliance finally cut after 25 years

రాజకీయ చిచ్చు : పటాపంచలైపోతున్న ఏళ్ల సంబంధాలు!

Posted: 09/25/2014 09:47 PM IST
Bjp shiv sena party alliance finally cut after 25 years

‘‘కలిసుంటే కలదు సుఖం’’ అంటూ నిన్నమొన్నటివరకు నినాదాలు చేసుకుంటూ చేతులు పిసుక్కున్న బీజేపీ, శివసేన పార్టీలు.. ఇప్పుడు విడిపోయినట్లు అధికారికంగా ప్రకటనలు వస్తున్నాయి. తమ మధ్య వున్న పొత్తును కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. అన్నీ విఫలమయ్యాయి. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు ముందే వీరిమధ్య ఈ పొత్తు బెడిసికొట్టింది. శివసేన పార్టీతో తాము వేగలేముంటూ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఫడ్నావిస్ కూడా ప్రకటించేశారు. తమ మధ్య ఇక ఎటువంటి పొత్తు లేదని, స్వచ్ఛందంగానే కూర్చుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో అక్టోబర్ 15వ తేదీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రెండుపార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయంలో అవగాహన కుదరకపోవడంతోనే పాతికేళ్ల స్నేహబంధాన్ని ముగించేసినట్లు ఆయా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి సుమారు రెండువారాలుగా బీజేపీ చీఫ్ అమిత్ షా, శివసేన నేత ఉద్ధవ్ థాకరే వర్గీయుల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరుగుతూ వచ్చాయి. మొదట్లో శివసేన 151 సీట్లకు, బీజేపీ 130 సీట్లకు పోటీ చేయాలని వర్గీయులు అనుకున్నారు. కానీ ఈ విషయం అమిత్ షాకు నచ్చినట్లు లేదనిపిస్తోంది. గురువారం ముంబైని ఆయన సందర్శించవలసి వున్నప్పటికీ.. ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఇన్నాళ్లవరకు వచ్చిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది.

అలాగే మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా తమ మధ్య ఇక ఎటువంటి పొత్తు లేదని స్పష్టం చేస్తూనే.. మరికొన్ని విషయాలను తెలిపారు. సీట్ల సర్దుబాటు విషయంలో శివసేన మొదటినుంచి మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. పొత్తు విచ్ఛిన్నమైనంత మాత్రాన తమ మధ్య విభేదాలు వుండవని, స్నేహపూర్వకంగానే శివసేనను ప్రత్యర్థిగానే భావిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో శివసేనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయబోమని తెలిపారు. రాజకీయాల్లో ఎఫ్పుడు, ఎవరూ స్నేహితులవుతారో.. విడిపోతారోనన్న విషయానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇదిలావుండగా.. కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య 15 ఏళ్ల బంధం ముక్కలైపోయినట్లు ఎన్సీపీ ప్రకటించేసింది. మహారాష్ట్రాలో ఎన్సీపీ బలమేంటో కాంగ్రెస్ తెలుసుకోవాలని ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి సరిగ్గా లేకపోవడమే తమ మధ్య విభేదాలకు కారణమని ఆయన తెలిపారు. అయితే తమ బందం తెగిపోయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ తమకు స్నేహపూర్వక ప్రత్యర్థి అని తెలిపారరు. తమ పార్టీ ఎన్నికల కోసం సర్వసన్నద్ధంగా వుందని ఆయన స్పష్టం చేశారు. ఇవే బాబు రాజకీయాలంటే..! ప్రజలకు న్యాయం చేయాల్సిన పార్టీలే ఇలా గొడవలు పడుతూవుంటే.. ప్రజలు తమ గోడును ఎవరితో చెప్పుకోవాలి..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles