Ap cm chandrababu naidu meeting with committee members on capital city

chandrababu naidu, ap cm chandrababu naidu latest news, chandrababu naidu committee, chandrababu naidu meeting, ap capital city, vijayawada news, ap capital city vijayawada, chandrababu naidu capital city meeting, capital committee

ap cm chandrababu naidu meeting with committee members on capital city

రాజధాని విషయంలో బాబు-కమిటీ దబిడిదిబిడే! డైలామా..

Posted: 09/25/2014 08:45 PM IST
Ap cm chandrababu naidu meeting with committee members on capital city

అధికారంలోకి వచ్చిన మూడునెలల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ క్లారిటీ లేకుండా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం వుంటుందని అసెంబ్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే! ఇక్కడ ఆయన స్టేట్ మెంట్ ప్రకారం రాజధాని విజయవాడేనని అర్థం! అలా ఆయన ప్రకటించిన వెంటనే రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, జమా, ఖర్చులు, నిర్మాణం, కేటాయింపులు తదితర అంశాల పరిశీలనకు, వాటి అమలుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ కూడా ఇప్పుడు ఫుల్ డైలామాలో మునిగిపోయింది. భూకేటాయింపుల ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో ఏ పని ఎక్కడినుంచి మొదలుపెట్టాలి..? ప్రణాళికలు ఎలా అమలు చేయాలి..? ఎప్పటినుంచి చేయాలి..? అన్న సందేహాల్ల మునిగిపోయారు. ముఖ్యంగా ఇక్కడ భూకేటాయింపు విషయంలో పెద్ద రచ్చే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో పూర్తి డైలామాలో మునిగిపోయిన ఆ కమిటీ.. ఏం చేయాలో తోచక ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. రాజధాని విషయంలో తమకు ఇంకా క్లారిటీ రాలేదని బాబుకు తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధానికి అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించాలా..? లేక ప్రస్తుతమున్న ప్రభుత్వ భూమి సరిపోతుందా..? అనే విషయంపై ఆ కమిటీ బాబుతో చర్చలు కొనసాగించింది. ఒకవేళ భూమిని సేకరించాల్సి వస్తే.. విజయవాడకు ఏ వైపుగా వున్న భూమిని సేకరించాలి..? ఎంత భూమిని సేకరించాలి..? అనే అంశాలను కమిటీ ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం! ఈ చర్చనీయాంశలు బట్టి చూస్తుంటే.. రాజధాని విషయం ఇంకా ఇప్పుడే కొలిక్కి రానట్టు కనిపిస్తోంది. అటు రాజధాని పనులు ఎంత వేగంగా ప్రారంభించినప్పటికీ.. పూర్తిగా ఏర్పాటు అయ్యేవరకు దాదాపు 30ఏళ్ల కంటే ఎక్కువ సమయమే పడవచ్చునని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap capital city  vijayawada  capital committee  andhra pradesh state  

Other Articles