Insult to ntr once again

ap government, NTR, Insult, Bharat ratna, award, NDA, UPA, Purandeshwari, TDP, Parliament, recommended

NTR's name has not been recommended for the Bharat Ratna award, by the AP government

‘అన్న’గారికి ఇంకా అవమానమా..?

Posted: 09/23/2014 12:46 PM IST
Insult to ntr once again

తరాలు మారినా.. యుగాలు మారిని తెలుగువారి గుండెల్లో నిత్య చిరంజీవిగా నిలిచే వ్యక్తి ఎన్టీయార్. తెలుగు ప్రజల మనస్సుల్లో రాముడిగా, కృష్ణుడి, రావణాసురడుగా, యమధర్మరాజుగా, కర్ణుడిగా, ధుర్యోధనుడిగా చిరస్థాయిగా నిలచే మహానటుడు. దైవం అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీయార్ రూపమే. రాష్ట్ర రాజకీయాల్లో బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవగాహన కల్గించిన చైతన్యమూర్తి. ఆయన ప్రసంగానికి సమ్మోహనులు కాని తెలుగు వారెంరుంటారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రభంజనాన్ని సృష్టించిన ధీరుడు. రాజకీయాల్లో వచ్చిన తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి.. చరిత్రను తిరగరాసిన ఘనుడు.. ఎన్టీయార్. తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు అన్న.

మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ మరణవార్త యావత్ దేశ ప్రజానికాన్ని కలచివేసింది. ఆ తరుణంలో వచ్చిన ఎన్నికలలో యావత్ దేశం అమెను ఓటుతో ఘన నివాళి అర్పించగా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం ఇందిరమ్మ కన్నా.. అన్నగారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దేశ పార్లమెంటు చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ.. ప్రతిపక్ష స్థానాన్ని అలకరించడం కూడా ఆ సందర్భంలోనే జరిగింది. టీడీపీ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష హోదాను అలంకరించింది. యావత్ దేశం తెలుగువారిని మద్రాసీ అని సంబోధించకుండా తెలుగువారి ఖ్యాతిని దేశ, ప్రపంచ వ్యాప్తంగా చాటిన మహానుభావుడు ఎన్టీయార్. ఇదంతా అన్న ఎన్టీయార్ గురించి చెప్పాల్సి వస్తే ముచ్చటగా మూడు అంశాలను ప్రసావించాం. రామన్న గురించి చెప్పాలంటే పుటలు, పుటులుగానే చెప్పాల్సి వుంటుంది.

అలాంటి అన్నగారికి ఇంకా అవమానం జరుగుతూనే వుంది. నటుడి, రాజకీయ వేత్తగా, ప్రజా చైతన్యమూర్తిగా ఎన్టీయార్ కు ఎప్పుడో భారత రత్న అవార్డు దక్కాల్సివుంది. రాజకీయ చదరంగంలో దేశ పురస్కారాలు కూడా చిక్కుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. యూపీఏ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు అవార్డు దక్కకపోవడంలో విచిత్రమేమీ లేదు. అయితే.. ధర్డ్ ఫ్రంట్, వాజ్ పాయ్ నేతృత్వంలోని ఎన్డీఏ హయంలో కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు.. అన్నగారికి ఎందుకు భారత రత్న అవార్డును అందించలేక పోయారు.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో వున్న సన్నిహత సంబంధాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నానని చెబుతున్న చంద్రబాబుకు.. ఎన్టీయార్ కు అరుదైన అవార్డును ఇప్పించడం అంత కష్టమైన పనా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో అప్పట్లో సఖ్యత లేని కారణంగానే చంద్రబాబు అప్పుడు భారత రత్న అవార్డును ఇప్పించలేకపోయారా..? అంటే అవునన్న సమాధానాలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి. ఎన్టీయార్ కుటుంబసభ్యుల విషయానికి వస్తే అందరూ ఆయనతోనే వున్నా.. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న హరికృష్ణ, దగ్గుబాటి కుటుంబసభ్యలు మాత్రం ఆయనతో విభేదించి పక్కకు జరిగారన్నది వాస్తవం. 1999లో వచ్చని ఎన్నికలలో అన్నగారి ముద్రను పార్టీ నుంచి పూర్తిగా చెరిపేసి.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అక్రమించుకోవాలని చంద్రబాబు యత్నించారన్న ఆరోపణలు వున్నాయి.

అ తరువాతి పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రిగా కూడా వున్నారు. ఈ పదేళ్లలో అమె తన వంతు పనిని చేశారు. పార్లమెంటులో ఎన్టీయార్ విగ్రహాన్ని పెట్టించగలిగారు. మరి ఇప్పుడు బంతి చంద్రబాబు కోర్టులో వుంది. ఇప్పడు సీఎం చంద్రబాబు, తన స్నేహితుడు, ప్రధాన మంత్రి మోడీతో చర్చించి స్వర్గీయ ఎన్టీయార్ కు భారత రత్న అవార్డును ఇప్పించగ లరా లేదా..? అన్నది తేలాల్సి వుంది.

వివిధ పురస్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితోలో రామన్న పేరు లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి జాబితా అందిందని, కాగా భారత రత్న అవార్డుకు ఏపీ ప్రభుత్వం ఎవరి పేరును సిఫార్సు చేయలేదని కేంద్ర హోం శాఖ తెలపింది. విషయం తెలియడంతో అన్నగారి అభిమానులు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అన్నగారి పేరును విరివిగా వాడుకుని, గెలిచి.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్.. మరోసారి ఎన్టీయార్ ను అవమానపరుస్తుందా..? అంటూ నిలదీస్తున్నారు. అసలెందుకు ఎన్టీయార్ పేరును సిఫార్సు చేయలేదని ఆలోచిస్తే.. ఇక్కడా ఒక కిటుకువుంది.

ఎన్టీయార్ కు భారత రత్న అవార్డు దక్కితే.. ఆ పురస్కారాన్ని ఎవరు అందుకోవాలి.? ఇదే ప్రశ్న వారి కుటుంబ సభ్యలను కూడా వెనక్కి జరిగేట్లు చేస్తుందట. ఎన్టీయార్ ప్రతిభను గుర్తించి.. కేంద్రం అవార్డును ఇవాల్సి వస్తే.. ఆయన కుటుంబ సభ్యలకు ఇవ్వాలా..? లేక రెండో భార్య లక్షీ పార్వతికి ఇవ్వాలా..? అన్న ప్రశ్న తెరపైకి వస్తుందట. కేంద్ర నియమావళిని అనుసరించి కేంద్రం అవార్డును రెండో భార్య లక్ష్మీపార్వతికే ఇవ్వాల్సి వుంటుందని, ఇది గిట్టకే చంద్రబాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గత యూపీఏ హయాంలో పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ సందర్భంగా కేంద్రమంత్రిగా వున్న పురంధేశ్వరి అప్పట్లో ఎన్టీయార్ రెండో భార్య.. లక్ష్మీపార్వతిని ఆహ్వానించనే లేదు. అమెకు అసలు ఆహ్వాన పత్రం కూడా పంపనే లేదట. మరి భారత రత్న అవార్డు విషయంలో అలా కాకుండా కేవలం లక్ష్మీపార్వతినే అధికారికంగా స్టేజి పైకి పిలిచి.. రాష్ట్రపతి అవార్డును అందజేయాల్సి వుంటుంది. అందుకనే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎన్టీయార్ పేరును భారత రత్నకు సిఫార్సు చేయడం లేదని అభిమానుల టాక్.

ఎన్టీయార్ కు భారత రత్న పురస్కారం అందడం.. అన్నగారి కుటుంబ విషయం మాత్రమే కాదని, దేశ విదేశాలలో వున్న కోట్లాది మంది అభిమానులకు సంబంధించిన అంశమంటున్నారు రామన్నఅభిమానులు. అవార్డును ఎవరు అందుకుంటున్నారు అన్న విషయం ముఖ్యం కాదన్నారు. ఎన్టీయార్ కు అవార్డు దక్కిందా..? లేదా..? అన్న విషయమే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందంటున్నారు. అందుకనే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాసి, ఎన్టీయార్ పేరును భారత రత్న అవార్డుకు సిఫార్సు చేయాలని కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap government  NTR  Insult  Bharat ratna  award  NDA  UPA  Purandeshwari  TDP  

Other Articles