Telangana industrial plan in no 1 in world says kcr

telangana, andhrapradesh, cm kcr, telanagana cm kcr, k chandrashekar rao, industrial plan, telangana industrial plan, mahaboobnagar, palamooru, latest news, single window plan, hyderabad

telangana cm kcr says his government done world no.1 plan for industrial sector in telangana : corruption free industrial plan with single window in telangana

ఇలాంటిది ఎక్కడా లేదని కేసీఆర్ ఆశ్చర్యం

Posted: 09/18/2014 06:03 PM IST
Telangana industrial plan in no 1 in world says kcr

తెలంగాణను సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రస్తుతం దూసుకెళ్తున్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.., పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ., ప్రపంచంలో ఎక్కడా లేని పారిశ్రామిక విధానం తెలంగాణలో అమల్లో ఉందన్నారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు తెలంగాణలో పెట్టబడులు పెట్టేందుకు వస్తున్నాయని తెలిపారు.

అటు మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు సింగిల్ విండో విధానం పాటిస్తామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అవినీతి రహితంగా పారిశ్రామిక విధానం తయారు చేసినట్లు వెల్లడించారు. అన్ని అనుమతులు ఒకేచోట లభ్యం అయ్యేలా కొత్తగా పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు. త్వరలోనే ఈ విధానం ప్రజల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. పరిశ్రమల అనుమతుల్ని స్వయంగా తానే పరిశీలిస్తానని కేసీఆర్ చెప్పారు.

పాలమూరుకు వచ్చిన కంపనీల వల్ల వెయ్యిమందికి పైగా ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. అటు పరిశ్రమలు స్థాపించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో 34,184 ఎకరాల భూమి సిద్దంగా ఉందన్నారు. సింగిల్ విండో పారిశ్రామిక విధానం అని తెలంగాణ వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఆ విధానం ఏమిటో ఇంతవరకు చెప్పలేదు. ఇంకో రెండ్రోజులు ఆగి ప్రకటిస్తామన్నారు. విధానం ప్రకటించటానికే నాలుగు నెలలు పడితే..., దాన్ని అర్ధం చేసుకుని కంపనీలు రావటానికి ఇంకెంత సమయం పడుతుందో అని విమర్శకులు చమత్కరిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  kcr  industrial plan  single window  

Other Articles