Isis terrorists beheads david haines

isis terrorists, isis terrorost force, isis attacks, iraq, syria, latest news, america on syria, america on iraq, briatain, cameron, obama, attacks, world wars, muslim state, muslims, journalist behead, murders, rapes, david hains

isis terroristst hostages another man's head, releases david haines video on saturday : david haines beheaded by isis terrorists in isis terrorists hands for british activities agains them says terrorists

తీవ్రవాదుల చేతిలో మరో తల తెగిపడింది

Posted: 09/14/2014 12:21 PM IST
Isis terrorists beheads david haines

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆగడాలు ఏమాత్రం ఆగటం లేదు. తీవ్రవాదులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు అమెరికన్ జర్నలిస్టులను క్రూరంగా చంపిన తీవ్రవాదులు  తాజాగా బ్రిటన్ జాతీయుడిని బలతీసుకున్నారు. డేవిడ్ హైన్స్ అనే బ్రిటన్ జాతీయుడిని అతి దారుణంగా గొంతుకోసి చంపారు. శనివారం రోజు ఇంటర్నెట్ లో ఈ దారుణానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మిత్ర దేశాలకు ఒక సందేశం’’ అనే పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తమ పట్ల అమెరికాతో పాటు బ్రిటన్ కూడా అణిచివేతగా వ్యవహరిస్తోందని వీడియోలో ఉగ్రవాది మండిపడ్డారు.

ఇక బ్రిటన్ ప్రధానిని ఉద్దేశించి ఉగ్రవాది డేవిడ్ కేమరూన్ నేరుగా విమర్శలు చేశారు. గత ప్రధానులకు మాదిరే కేమరూన్ కూడా అమెరికా వెన్నంటి నడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామాతో స్వచ్చందంగా చేతులు కలిపి తమపై పోరాటానికి దిగారని విమర్శించారు. బ్రిటన్ ప్రభుత్వ చర్యలకు నిరసనగానే డేవిడ్ హైన్స్ మృతి అని.., వైఖరి మార్చుకోకుంటే మరిన్ని మరణాలు తప్పవని హెచ్చరించారు. దారుణ హత్యకు గురైన హైన్స్ ఓ అంతర్జాతీయ ఛారిటీ సంస్థలో పనిచేస్తున్ానడు. 2013లో అతడిని ఉగ్రవాదులు అపహరించారు.

బ్రిటన్ జాతీయుడి ఊచకోతపై ఆదేశ ప్రధాని డేవిడ్ కేమరూన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కిరాతక చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. అతి  హేయమైన దుశ్చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్ట ప్రసక్తే లేదన్నారు. హెయన్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపటంతో పాటు బాధితుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అటు ఈ దుర్ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విచారం వ్యక్తంచేశారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులది ఆటవిక చర్య అని విమర్శించారు. ఇక మిలిటెంట్లను ఏ మాత్రం సహించమనీ.., బ్రిటన్ తో కలిసి ఉగ్రవాదులను వేటాడుతామన్నారు. అంతేకాకుండా తమతో కలసివచ్చే దేశాలతో చేతులు కలిపి తీవ్రవాదాన్ని తుడిచేస్తామని ఒబామా స్పష్టం చేశారు.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదులు.., ఇప్పటికే ఇరాక్ లోని చాలా ప్రాంతాలను ఆక్రమించారు. పలువురు భారతీయులను సైతం బంధీలుగా పట్టుకోగా.., ప్రభుత్వ చొరవతో వారంతా విడుదలయ్యారు. ముస్లిం రాజ్య స్థాపన లక్ష్యంతో పనిచేస్తున్న వీరు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలకు చెందిన పౌరులను వరుసగా హత్యలు చేస్తున్నాయి. వీరి చెరలో ఇరాక్, సిరియా దేశాలకు చెందిన ప్రజలు కూడా ఉన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : david hains  obama  david cameron  isis terrorists  

Other Articles