Mahesh fan jumps into water flow

mahesh babu, mahesh babu fans, mahesh babu latest movies, mahesh babu movies, aagadu, aagadu movie release date, aagadu movie songs, aagadu review, mahesh fan sucide attempt, flexi, banners, latst news

maheshbabu fan jumps into water flow by disappoint over vijayawada officials act against mahesh flexi banner : vijayawada officials objected mahesh 90feet felxi for not taking permission quarrel with fans during that a fan jumps into water flow

మహేష్ కటౌట్ తొలగింపు.., కాల్వలో దూకిన అభిమాని

Posted: 09/14/2014 12:50 PM IST
Mahesh fan jumps into water flow

అభిమానం తలకెక్కిన ఓ అభిమాని మహేష్ బాబు కోసం ఆత్మహత్యాయాత్నం చేశాడు. అధికారులు కటౌట్ తొలగిస్తున్నారనే ఆవేదనతో కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.., మహేష్ బాబు తాజా చిత్రం ఆగడు కొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి విజయవాడ అలంకార్ సెంటర్లో ప్రిన్స్ అభిమానులు 90 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ ఏర్పాటుపై అధికారులు అభ్యంతరం తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేయటంతో తొలగింపు కోసం చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో అధికారులతో మహేష్ అభిమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో అలంకార్ సెంటర్లో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం తోసేసుకున్నారు. ఇదే క్రమంలో కటౌట్ తొలగించి తీరుతామని అధికారులు స్పష్టం చేయటంతో.., మనస్తాపం చెందిన ఓ అభిమాని కటౌట్ పైనుంచి కాల్వలో దూకాడు. గమనించిన స్థానికులు, మహేష్ అభిమానులు కాపాడి బయటకు తీసుకువచ్చారు. పరిస్థితి మరింత అదుపుతప్పటంతో స్పందించిన పోలిసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను అలంకార్ సెంటర్ నుంచి చెదరగొట్టారు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న ఆగడు సినిమాలొ మహేష్ మరోసారి పోలిస్ క్యారెక్టర్లో నటించాడు. దూకుడు తర్వాత ఈ సినిమాలో ప్రిన్స్ పోలిస్ పాత్రలో ఉన్నాడు. అటు దూకుడు హిట్ అందించిన శ్రీను కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 14రీల్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మూగ్గురి కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పాటలకు మంచి స్పందన రావటంతో పాటు.., శుక్రవారం రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ తో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  mahesh fans  vijayawada  latest news  

Other Articles