In rajasthan aadhar card issud to lord anjaneya

aadhar cards, aadhar card number, aadhar card centres in andharpradesh, aadhar centers in hyderabad, latest news, aadhar cards update, rajasthan, hanuman, lord hanuman, postal department

rajasthan aadhar agency issued aadhar card to lord anjaneya sent to post office : an other negligence happend in aadhar cards in the name of lord hanuman

ఆంజనేయుడికీ ఆధార్ కార్డు వచ్చింది

Posted: 09/11/2014 01:29 PM IST
In rajasthan aadhar card issud to lord anjaneya

ఇందుగలడందు లేదన్నట్లు భగవంతుడు ప్రతి చోటా ఉంటాడని అందరూ నమ్ముతారు. కాని మనదేశ వ్యవస్థ ఆంజనేయుడికి పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఇచ్చింది. అంతేకాదు హనుమంతుడికి ఆధార్ కార్డు కూడా ఇచ్చేశారు. రాజస్థాన్ లో వెలుగుచూసిన పవనపుత్రుడి ఆధార్ కార్డు ఇప్పుడు సంచలనం కల్గిస్తోంది. రాజస్థాన్ లోని సికార్ పోస్టాఫీస్ కు ఓ ఉత్తరం వచ్చింది. అయితే దానిపై అడ్రస్ సరిగా లేకపోటంతో.., పూర్తి అడ్రస్ తెలుసుకునేందుకు లెటర్ చించారు పోస్టుమన్లు. కవర్ తెరిచిన వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అందులో ఆంజనేయుడి ఆధార్ కార్డు ఉంది.

కార్డులో హనుమంతుడి ఫోటో ఉండటంతో పాటు కార్డుదారు పేరు దగ్గర హనుమాన జీ అని తండ్రిపేరు అనే చోట పవన్ జీ అని ఉంది. ఇక కార్డుపై ఉన్న మొబైల్ నంబర్ కు ఫోన్ చేస్తే ఓ వ్యక్తి లిఫ్ట్ చేసి తనకేం సంబంధం లేదని చెప్తున్నాడు. కార్డుపై తన నంబర్ ఎలా వచ్చిందో తెలియదని సమాధానం ఇస్తున్నాడు. దీంతో ఇప్పుడీ కార్డు ఎవరికి ఇవ్వాలి.. ఎవరు పంపారు అని పోస్టల్ శాఖ తల పట్టుకుంటోంది. ఆంజనేయుడికి ఆధార్ కార్డేమిటి భగవంతుడా అని అవాక్కవుతున్నారంతా.

విషయం ఏమిటంటే ఆధార్ కార్డుల జారీ ఏజన్సి చేసిన ఆకతాయి పని ఇది. హనుమాన్ ఫొటోతో ఆధార్ కార్డు వివరాలు నమోదు చేశారు. అది చూసుకోకుండా సిబ్బంది కార్డు జెనరేట్ చేసి తిరిగి పంపారు. ఇది దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ జారీ ప్రక్రియ పనితీరు. ఈ ప్రాజెక్టు ఓ ప్రహసనంలా మారిందని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. సామాన్యుడి హక్కు అని చాటుతున్న సర్కారు.., అన్నిటికి ఆధార్ లింకు చేస్తుంది. ఇలాంటి లోపాలతో ఉన్న కార్డుల ఆధారంగా పధకాలు అందిస్తామని గొప్పగా చెప్పుకుంటోంది. మరి ఇప్పుడు హనుమంతుడికి రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ కూడా వస్తే.., దానికి ఆధార్ అనుసంధానం చేసి ఏ గుడికి పంపుతారో చూడాలి అని నెటిజన్లు సరదాగా సెటైర్లు వేసుకుంటున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhar cards  lord hanuman  rajasthan  latest news  

Other Articles