Good times over for hmt watches

HMT Watches, winding off, central government, japan, citizen watches, collaberation

HMT Watches production comes to an end, center decides to wind up company

ఆ గడియారపు వెలుతురులు ఇక కనుమరుగు..

Posted: 09/11/2014 01:32 PM IST
Good times over for hmt watches

పాత కాలం నుంచి నేటి కాలం వరకు పెళ్లిళ్ల సమయంలో ఆనవాయితీగా వస్తున్న చేతి గడియారం కానుక గురించి మనకు తెలుసు. అయితే ఈ చేతి గడియారాలలోనూ పేద వారి నుంచి పెద్దవారి వరకు అందరు మనస్సు పడిన హెచ్ఎంటీ చేతి గడియారాల వెలుతురులు ఇక అంతరించిపోనున్నాయి. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వున్న హెచ్ఎంటీ చేతి గడియారాల సంస్థను 1961లో కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వర్గాల ప్రజల హృదయాలను ఈ వాచ్ లు చూరగోన్నాయి. వాచ్ అంటేనే హెచ్ఎంటీ అనే స్థాయికి ఎదిగిన సంస్థ.. ఇప్పుడు అకస్మాత్తుగా తన ఉత్పత్తులను నిలిపివేయనుంది.

గతంలో వెలిగిన వెలుతురులు ప్రపంచీకరణ నేపథ్యంలో క్రమేపి సన్నగిల్లాయి. ప్రస్తుతం జీతాలు చెల్లించుకునే స్థితిలో కూడా హెచ్ఎంటీ లేదంటే అశ్చర్యం కలగక మానదు. 2011-12లో రూ.242 కోట్ల రూపాయలను, అదే విధంగా 2012-13లో రూ.224 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చింది. జపాన్ సిటిజన్ వాచ్ సహకారంతో  స్థాపించడిన సంస్థలో ప్రస్తుతం కేవలం 1105 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మాగారం మూసివేయాలన్న కేంద్రం నిర్ణయంతో వీరంతా ఇప్పడు రోడ్డున పడబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HMT Watches  central governament  

Other Articles