Isis terrorists thretens twitter emplyoees to assasinate them

twitter, facebook, linked,in, yahoo.com, google plus, gmai.l, skype, youtube, social media, isis terrorists, latest news, iraq, syria, attacks, assasination, job in twitter, jobs in facebook, america

isis terrorists warned twitter employees to be assasinated by their loan wolfs : isis orderd its sleeper cells to assasinate and cruelly murder each of twitter employee of evary branch office

ట్విట్టర్ ఉద్యోగులందర్నీ చంపాలని ఉగ్రవాదుల నిర్ణయం

Posted: 09/10/2014 12:19 PM IST
Isis terrorists thretens twitter emplyoees to assasinate them

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరీ రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను బందీలుగా చేసుకుని రాజ్యాలను ఆక్రమించుకుంటున్న ఉగ్రవాదులు.., వారి ఆకృత్యాలపై గలమెత్తిన ప్రతి ఒక్కరినీ హతమారుస్తున్నారు. అమెరికా ప్రభుత్వం బాంబులు వేస్తే.., ఉగ్రవాదుల కోపానికి బంధీలుగా ఉన్న జర్నలిస్టులు బలయ్యారు. తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఉద్యోగులను కూడా ఉగ్రవాదులు హెచ్చరించారు. ట్విట్టర్ ఉద్యోగులందర్నీ చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ బెదిరింపు సందేశాలు సోషల్ మీడియా సైట్లతో పాటు నేరుగా ట్విట్టర్ లోనే పోస్ట్ చేసి ఉద్యోగులను బెదిరించారు.

ప్రతి ఉద్యోగినీ చంపాలని పిలుపు

అమెరికా యూరప్ దేశాల్లో ‘‘లోన్ వూల్ప్స్(ఉగ్రవాదుల కోసం పనిచేసే వ్యక్తులు) ట్విట్టర్ ఉద్యోగుల కదలికలపై కన్నేసి ఉంచాలని ఆదేశించారు. వారు ఎక్కడ కన్పించినా దాడులు చేసి హతమార్చాలన్నారు. ఏ ఒక్క ఉద్యోగినీ వదిలి పెట్టవద్దనీ.., ప్రతి ఒక్కరినీ చంపాలని స్పష్టం చేశారు. ఇక ట్విట్టర్ యజమాన్యంపై అయితే నేరుగా దాడులు చేయాలని చెప్పారు. స్లీపర్ సెల్స్, లోన్ వూల్ప్స్ ఈ దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇస్లామిక్ స్టేట్ పిలుపునిచ్చింది. ట్విట్టర్ ఉద్యోగి ఇంటి బయట కూడా ఉగ్రవాది ఉంటాడనే విషయం వారు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.

గతంలో ఈజిప్టులో ఏళ్లుగా కొనసాగిన ప్రజా ఉద్యమం సోషల్ మీడియా ద్వారా ఉదృతమై వారికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లే స్వాతంత్ర్యాన్ని ఇచ్చాయన్నమాట. అలాంటి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్) ఉగ్రవాదుల ఆగడాలకు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వారి ఆకృత్యాలపై ప్రజలు మండిపడుతున్నారు. ఉగ్రవాదులకు బుద్ది చెప్పాలని ఆగ్రహంతో ఊగిపోతూ సందేశాలు పంపుతున్నారు. దీంతో ట్విట్టర్ పిట్ట తమ కంట్లో పొడుస్తుందని భయపడ్డ ఉగ్రవాదులు ఉద్యోగులందర్నీ హతమార్చాలని నిర్ణయించారు.

ఈ బెదిరింపులపై అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని చెప్పింది. అటు సందేశాలు పోస్ట్ చేసిన రెండు ట్విట్టర్ అకౌంట్లను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇలాంటి సందేశాలను ఫిల్టర్ చేసి నిఘా పెడుతున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. అయితే అమెరికా, యూరప్ దేశాల్లో ట్విట్టర్ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహకరించే కొన్ని సంస్థలు, వ్యక్తులు ఉండటం ఆందోళన కల్గించే విషయం. ఏం భయం లేదని యాజమాన్యం చెప్తున్నా.., ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో అని సగటు ఉద్యోగులు వణుకుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : twitter  isis terrosists  assasination  latest news  

Other Articles