Shiva sena to weild love trishul

love jihad, love trishool, love trishul, uttarpradesh, latest news, mulayam singh yadav, sp, bsp, india, pakisthan, hindu, muslim, religoins in india, castes in india, bjp, nda, narendra modi, shivasena, bal thakre, uddav thakre

shiva sena party started love trishul as bramhastra on love jihad : up branch of shivasena started love trishool to stop hindu girls from love jihad trap

‘లవ్ జిహాద్’ పై సైన్యం ‘లవ్ త్రిశూల్’ అస్ర్తం

Posted: 09/10/2014 12:42 PM IST
Shiva sena to weild love trishul

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా శివసేన అస్ర్తాన్ని ప్రయోగించింది. జిహాద్ కు వ్యతిరేకంగా లవ్ త్రిశూల్ ను రంగంలోకి దించుతున్నట్లు శివసేన ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అనిల్ సింగ్ తెలిపారు. లవ్ జిహాద్ పై ఇది బ్రహ్మాస్ర్తంగా పనిచేస్తుందన్నారు. తమ కార్యక్రమం యొక్క విధివిధానాలను కూడా ఆయన ప్రకటించారు. లవ్ జిహాద్ నుంచి హిందూ అమ్మాయిలను రక్షించటమే లక్ష్యంగా త్రిశూల్ పుట్టిందన్నారు. లవ్ త్రిశూల్ కోసం పనిచేసే ప్రత్యేక బృందాలు.., ఎవరైనా హిందూ అమ్మాయిని లవ్ జిహాద్ లో భాగంగా ప్రలోభపెట్టినట్లు తెలిసిన వెంటనే రంగంలోకి దిగుతాయి. అబ్బాయిలను హెచ్చరించటంతో పాటు అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉగ్ర కుట్రల నుంచి చైతన్యపరుస్తామని అనిల్ చెప్పారు.

ప్రేమ వల ద్వారా హిందూ యువతులను మత మార్పిడి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని యువతులను రక్షించటమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతుం యూపీలోని బరేలిలో ప్రారంభమైన త్రిశూల సైన్యం త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. ఒక వర్గం వ్యక్తులు తమ జనాభాను పెంచుకునేందుకు హిందువులను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్ పేరుతో వల వేస్తున్నారని ఆరోపించారు. వారిని త్రిశూల్ ద్వారా కట్టడి చేస్తామన్నారు. స్కూళ్లు, కాలేజిల స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు, వారి తల్లితండ్రులు, సంరక్షకులకు ఐడి కార్డులు ఇవ్వాలన్నారు.

ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చిన లవ్ జిహాద్ ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వర్గం (హిందువులు కాదు ) యువకులు హిందు యువతులను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వల వేసి వారిని పెళ్లఇ చేసుకుంటున్నారు. పెళ్లి సమయంలో అమ్మాయిలను హిందుత్వం నుంచి తమ మతంలోకి మార్చుకుని మత ప్రచారం చేసుకుంటున్నారు. దీని వల్ల హిందువుల సంఖ్య తగ్గటమే కాకుండా, యువతులను కేవలం తమ లక్ష్యం కోసం పెళ్ళి చేసుకుంటున్నారన్న అపవాదు ఉంది. ఇలాంటి ఘటనలు చాలా వెలుగుచూడటంతో ధార్మిక సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. మత మార్పిడిని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ వివాదంలో ఉత్తరప్రదేశ్ లోని ములాయం సర్కారు తీవ్ర విమర్శలపాలవుతోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love jihad  love trishul  shivasena  latest news  

Other Articles