World bank warns about job crisis

jobs, world bank, it jobs, government jobs, bpo jobs, job notifications, world bank, job crisis, jobs in india, jobs abroad, latest news, private jobs, job alerts, g20 countries, india

world bank warned about global job crisis in its tuesday report : g20 countries and other countries facing job crisis says world bank

ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది- ప్రపంచ బ్యాంకు

Posted: 09/09/2014 03:50 PM IST
World bank warns about job crisis

ఆర్ధికమాంద్యం, ద్రవ్యోల్బణం వెరసి ఇఫ్పుడు ఉద్యోగ సంక్షోభం ఏర్పడినట్లు ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కొరత ఉందని తెలిపింది. జనాభాకు తగినన్ని ఉద్యోగాలు ఇప్పుడు లేవని చెప్పింది. మంగళవారం జరిగిన ఎంప్లాయ్ మెంట్ మినిస్టిరియల్ సమావేశంలో ప్రపంచ బ్యాంకు సీనియర్ డైరెక్టర్ నిగెల్ ట్వోస్ ఒక సర్వే నివేదికను వెల్లడించారు. తాము అధ్యయనం చేసిన సర్వే ప్రకారం ప్రపంచంలో ప్రస్తుతం జనాభాకు తగినన్ని ఉద్యోగాలు లేక సంక్షోభం ఏర్పడిందన్నారు.

పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని 2030సంవత్సరం నాటికి కొత్తగా 600 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్యా ఇది కష్టమని చెప్పారు. ఉద్యోగాల విషయానికి వస్తే అర్హతకు తగ్గ హోదా దక్కటం లేదన్నారు. ఇందుకు నాణ్యత ప్రధాన కొరత కాగా.., ఆర్ధిక పరమైన అంశాలు, వ్యవస్థాపన సమస్యలు, దేశ స్థితిగతులు ఇతర ప్రభావిత అంశాలుగా పేర్కొన్నారు. ముఖ్యంగా జీ20 దేశాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. ఇంకొ ప్రమాదకరమైన విషయం ఏంటంటే.., జీ20 దేశాల్లో ఆదాయాల్లో అసమానతలు ఉన్నాయని నివేదిక చెప్తోందన్నారు. అయితే జీ20లోని బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధ చెందుతున్న దేశాల్లో ఈ తేడా కాస్త తక్కువగా ఉందని చెప్పారు.

మ్యాజిక్ బుల్లెట్ లేదు

ఇప్పుడున్న ఉద్యోగావకాశాలు చాలా తక్కువని.., కాలం మారితే పరిస్థితిని అంచనా వేయగలమన్నారు. ఉద్యోగాలను సృష్టించేందుకు కార్మిక శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు కృషి చేయాలన్నారు. లేకపోతే నిరుద్యోగ సమస్య పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ వద్ద మ్యాజిక్ బుల్లెట్ ఏమి లేదన్నారు. జీ 20 దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లో ఉద్యోగాల కల్పన రేటు ఎక్కువగా ఉందన్నారు. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు జీ20 దేశాలు స్వతహాగా చర్యలు చేపట్టడంతో పాటు సభ్య దేశాలతో పరస్పరం సహకరించుకోవాలని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ సూచించారు. జీ 20 దేశాల్లో భారత్ కూడా సభ్యదేశంగా ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : job crisis  world bank  g20 countries  latest news  

Other Articles