Revanth reddy fires on kcr

revanth reddy, revanth reddy on kcr, kcr, trs, tdp, bjp, jagga reddy, medak mp elections, bypolls, latest news, ktr, harish rao, kavitha

tdp leader revanth reddy says he don't care of police cases : kcr should face my challange on corruption says revanth reddy

కేసీఆర్ కేసులు ఏమీ పీకలేవన్న స్టార్ లీడర్

Posted: 09/07/2014 06:23 PM IST
Revanth reddy fires on kcr


మెదక్ ఉప ఎన్నికలు అధికార - విపక్షాల మద్య మాటల యుద్ధాన్ని పెంచుతున్నాయి. రెండు పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. రాజకీయ విమర్శల నుంచి చవకబారు ఆరోపణలకు వరకు మాటలయుద్ధం వెళ్ళింది. ఆదివారం  జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.., కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కేసీఆర్ పెట్టే కేసులకు ఎవరూ భయపడరన్నారు. ఆయన అక్రమ కేసులు వెంట్రుక కూడా పీకలేవని విమర్శించారు. అవినీతి ఆరోపణలు చేయటం కాదు వాటిని నిరూపించాలన్నారు. అవినీతి ఆరోపణలపై బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇక ప్రచారంలో పాల్గొన్న జగ్గారెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మెదక్ ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని సూచించారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిపోయిందని ద్వజమెత్తారు.

ఆ మద్య కేసీఆర్ పై ఆరోపణలు చేసినందుకు ఓ న్యాయవాది రేవంత్ రెడ్డిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు పెట్టాలని పోలిసులను ఆదేశించింది. ఈ  విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ పై రేవంత్ తాజాగా విమర్శలు చేశారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  medak bypoll  latest news  

Other Articles