చిన్న, చిన్న కారణాలకు తిట్టుకోవటం కోప్పడటం తెలుసు. చిన్న కారణాలకే కోపం ఎందుకు అని అంటుంటాం కూడా.., కాని ఇప్పుడు చిన్న కారణాలకే దాంపత్య బంధాలు తెగిపోతున్నాయి. మాట అన్నా.., మనసుకు నచ్చని ఏ చిన్న పని చేసినా విడాకులే పరిష్కార మార్గం అంటున్నారు ఈ తరం జంటలు. మహారాష్ర్టలో ఇలా చిన్న కారణాలతోనే రెండు జంటలు విడిపోయాయి.
తన భార్య ప్రవర్తన నచ్చక సరిచేసుకోమని ఓ మాట అంటే అందుకు విడాకులు ఇచ్చిందని ఓ భర్త వాపోయాడు. అతని వివరాల ప్రకారం... ముంబైలో ఉండే బాధితుడికి 2011లో పెళ్ళి అయింది. భార్య ఇంటిపనులు ఏమి చేయదు. ఎప్పుడు శృంగారం చేయమని భర్తను బలవంతపెడుతుంది. అయితే అన్నిసార్లు చేయటం మంచిదికాదు.., ఆరోగ్యం కూడా పాడవుతుందని వారించేవాడు. ఇలా చెప్పినందుకు తనని హిజ్రా అని తిట్టేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనతో పాటు కుటుుంబ సభ్యులను కూడా ఎప్పడు తిడుతుండేదనీ..,వారిపై తప్పుడు కేసులు పెట్టేదని కోర్టుకు తెలిపాడు. అతని బాధలు విన్న న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
ఇక మరో కేసులో ఎండాకాలంలో తన భర్త ఫ్యాన్ వేసుకోనివ్వటం లేదని కోర్టుకు భార్య తెలిపింది. కరెంట్ బిల్లు పెరుగుతుందనే సాకుతో ఫ్యాన్ వేయకుండా అడ్డుకుంటాడని తెలిపింది. తన భర్త హింసను భరించలేనంటూ విడాకులు కావాలని కోర్టును కోరింది. కౌన్సిలింగ్ చేసినా వైఖరిలో మార్పు లేకపోవటంతో 14ఏళ్ళ బంధానికి పుల్ స్టాప్ పెట్టేలా కోర్టు విడాకులు ఇచ్చింది. అంతేకాకుండా భార్యకు రూ.10లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఇలా చిన్న సమస్యలకే విడాకులు తీసుకుని పండంటి కాపురాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. సర్దుకుపోతే సంతోషం ఉంటుంది కానీ.., సాధింపులకు పోతే సర్వనాశనం అవుతుందన్న విషయం గ్రహిచటం లేదు ఇప్పటి తరం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jul 06 | ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త మాల్వేర్ తో ముప్పు పొంచి ఉందని ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆ మాల్వేర్ పేరు టోల్ ఫ్రాడ్. పేరులోని ఫ్రాడ్ కు తగ్గట్టుగానే ఇది మహా... Read more
Jul 06 | దేశీయ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి... Read more
Jul 06 | చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్‌తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు.... Read more
Jul 06 | దేశీయంగా, అంతర్జాతీయంగా విమానయాన సేవలను ప్రయాణికులకు కల్పిస్తున్న స్పైస్ జెట్ విమానాయాన సంస్థ గతకొన్ని రోజులుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటోంది. తమ సంస్థకు చెందిన విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో... Read more
Jul 06 | హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో... Read more