Governor narasimhan orders to andhra telangana states

governor narasimhan, narasimhan, andhra telangana governor narasimhan, andhra pradesh state, telangana state, intelligence officers, telangana raj bhavan, dgp anurag sharma, police commissioner mahendar reddy, alquida chief al javahari

governor narasimhan orders to andhra telangana states

తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రాలకు గవర్నర్ హెచ్చరికలు!

Posted: 09/06/2014 09:37 AM IST
Governor narasimhan orders to andhra telangana states

(Image source from: governor narasimhan orders to andhra telangana states)

రెండు తెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ -ఆంధ్రాలకు గవర్నర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న నరసింహన్... తాజాగా ఆ రెండు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే అల్-కాయిదా ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పోలీసులను అప్రమత్తం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని.. గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భ్రదతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటలిజెన్స్ అధికారులకు ఆయన సూచించారు. ఈ ఉగ్రవాద దాడులను అరికట్టాలంటే ప్రస్తుతం రెండు రాష్ట్రాలు సమన్వయంగా నడుచుకుంటూనే సాధ్యపడుతుందని.. కాబట్టి తమ మధ్య వున్న విభేదాలను పట్టించుకోకుండా ఉమ్మడిగా ముందుకు సాగి, నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఆదేశించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ అల్-కాయిదా చీఫ్ అల్ జవహరి ఇటీవలే ఒక వీడియో ప్రసంగం ద్వారా అందరికీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం రాజ్ భవన్ లో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఏపీ ఇంటెలిజన్స్ అదనపు డీజీ ఏఆర్ అనురాధ, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ తదితర అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో వున్న శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. సోమవారం హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరగనుండటంతో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాట్ట గురించి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి నిర్లక్ష్యం వుండకూడదని ఆయన అధికారులను హెచ్చరించారు.

గణేశ్ నిమజ్జనోత్సవం కోసం 15 వేల మందికి పైగా పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఆర్‌ఎఎఫ్ తదితర సాయుధ బలగాలను రంగంలోకి దించామని, మరి కొన్ని బలగాలను సిద్ధంగా ఉంచామని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. కాగా బందోబస్తుకు  అవసరమైన సిబ్బందిని, అధికారులను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనురాధ తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : governor narasimhan  andhra telangana states  police security  ganesh nimajjanam  

Other Articles