In telangana 54laks of people not having aadhar cards

aadhar cards, hyderabad aadhar card centers, how to get aadhar cards, aadhar cards details editing, latest news, aadhar cards link, social benefits, gas connection, bank accounts, latest news, telangana, kcr, samagra kutumba surey

survey shows 54laks of people in telangana not having aadhar cards : telangana government will make aadhar mandatory for all benifits but 54laks of people dont have this cards

తెలంగాణలో ఆధారాల్లేని 54లక్షల ప్రజలు

Posted: 09/06/2014 09:26 AM IST
In telangana 54laks of people not having aadhar cards

సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వానికి ఆశించిన ఫలితాన్నే ఇస్తోంది. ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకునే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ సర్వేలో ఆధార్ కార్డులు లేని వారి సంఖ్య కోటికి చేరువలో ఉన్నట్లు తెలిసింది. మొత్తం కోటి ఐదు లక్షల కుటుంబాల్లో శనివారం సాయత్రం వరకు దాదాపు ఎనబై లక్షల కుటుంబాల సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. ఈ వివరాల ప్రకారం.., యాబై నాలుగు లక్షల మందికి ఆధార్ కార్డులు లేవు. అయితే కంప్యూటరీకరణ పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

బ్యాంకు అకౌంటు, గ్యాస్ కనెక్షన్ దగ్గరి నుంచి ప్రతి ప్రయోజనానికి ఆధార్ తో లింకు పెడుతున్న ప్రభుత్వానికి ఇంత మందికి గుర్తింపు కార్డులే లేవని తెలిసి ఆశ్చర్యపోతుంది. ఆధార్ తీసుకోవాలనుకున్నా.., నమోదు కేంద్రాల అడ్రస్ తెలియకపోవటం.., తీసుకోకపోయినా నష్టం లేదన్న సుప్రిం కోర్టు తీర్పు, తమకు ప్రభుత్వ ప్రయోజనాలు ఉండవు కాబట్టి కార్డు అవసరం లేదనుకునే ఉన్నత వర్గాల వారు ఇలా పలు కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేదని తెలుస్తోంది. అయితే వీరందరూ ఆధార్ కోసం నమోదు చేసుకునేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhar cards  telangana  samagra kutumba surey  latest news  

Other Articles