Babu counters to jagan in assembly

chandrababu naidu, jagan, chandrababu naidu on jagan, tdp, bjp, ysr congress, andhrapradesh, ys rajashekar reddy, ap assembly, tdp mlas, ysr congress mlas, ap capital, vijayawada, latest news

ap cm chandrababu naidu given counters to jagan in assembly : jagan should learn how to behave in assembly as he is first time to assembly says chandrababu

అసెంబ్లిలో జగన్ ను ఆడుకున్న బాబు

Posted: 09/04/2014 01:51 PM IST
Babu counters to jagan in assembly

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత జగన్ ను అసెంబ్లిను ఆడుకున్నారు. సెటైర్లు, కౌంటర్లు, చురకలతో వాయించారు. టైం దొరికిన ప్రతిసారి జగన్ ను ఓ ఆట ఆడుకున్నారు. వైసీపీ సభ్యులు రెండు రోజులుగా రాజధానిపై చర్చ జరపాలని గొడవ చేస్తూ సభా కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నారు. దీంతో చంద్రబాబు చిర్రెత్తిపోయారు. రాజధానిపై ప్రకటన చేసిన వెంటనే ఇక జగన్ ను ఓ పట్టు పట్టారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరినీ కలిపి మరి కొన్ని సందర్బాల్లో విమర్శలు చేశారు.

తొలిసారి వచ్చారు తెలుసుకోండి

ప్రజా ప్రతినిదిగా జగన్ అనుభవాన్ని బాబు ప్రశ్నించారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు సభలో ఎలా ఉండాలో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కావటంతోనే ప్రతిపక్ష నేత అయిన జగన్.., హోదాకు తగినట్లు వ్యవహరించాలని చురకలంటించారు. ఎవరికి భయపడేది లేదని.., తనుకున్న అనుభవంలో ఎంతోమందిని చూశానని, మీరో లెక్కా అన్నట్లు మాట్లాడారు. వైసీపీ సభ్యులకు హుందాతనం, సభా వ్యవహారాలు తెలియవని ఎద్దేవా చేశారు.

ఇడుపులపాయ కేంద్రమా

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. వైఎస్ పాలన నిర్ణయాలు అందరికి తెలుసన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో మూడు ఐఐఐటీలు (బాసర, నూజివీడు, ఇడుపులపాయ) ఏర్పాటు చేశారని.., అయితే వీటి కేంద్ర కార్యాలయం రాజదానిగా ఉన్న హైదరాబాద్ లో కాకుండా ఇడుపుల పాయలో పెట్టారని ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఏదైనా సమస్య వస్తే ఇడుపుల పాయకు వెళ్ళాలా అని ప్రశ్నించారు. విభజనతో సంక్షోభంలో ఉన్నాం.. ఇప్పుడు పరస్పర విమర్శలు చేసుకోకుండా రాష్ర్టాభివృద్ధిలో సహకరించుకుందామని పిలుపునిచ్చారు. సభ్యులంతా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  jagan  ap assembly  latest news  

Other Articles