ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు.., ఒక ఫోన్ కాల్ పెళ్ళిని ఆపేసింది. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళు సినిమాల్లో చాలా చూశాం. అప్పుడప్పుడూ బయట కూడా చూస్తున్నాం. కాని ఇక్కడో ఎంగేజ్ మెంట్ మద్యలో ఆగిపోయింది. అప్పటివరకు కార్యక్రమంలో నవ్వుతూ అందర్ని పలకరించిన అబ్బాయి... చెప్పాపెట్టకుండా చెక్కేశాడు. చివరకు పెళ్ళి కూడా చేసుకోనని చెప్పటంతో అమ్మాయి కుటుంబం అబ్బాయిపై పోలిసులకు కంప్లయింట్ చేసింది. పెళ్ళికొడుకుపై పోలిసులు చీటింగ్ కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.
టోలిచౌకిలో ఉండే మహ్మద్ అబ్దుల్ రవూఫ్ తన కూతురుని మలక్ పేట్ కు చెందిన షౌకత్ అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం జరిగింది. జూన్ 15న ఓ ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వచ్చిన అబ్బాయి షౌకత్ మొదట్లో బాగానే అందరితో పలకరించాడు.., మాట్లాడాడు. అయితే మధ్యలో అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ మాట్లాడిన అబ్బాయి..., ఎవరికి చెప్పకుండా కార్యక్రమం మద్యలోనుంచే వెళ్లిపోయాడు.
అంతేకాదు అప్పటినుంచి పెళ్ళి వద్దని చెప్తున్నాడు. కొన్నాళ్ళ పాటు షౌకత్ తల్లితండ్రులు, అబ్దుల్ కుటుంబీకులు నచ్చచెప్పారు. అయినా సరే షౌకత్ విన్పించుకోవటం లేదు.., పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తరపు వారు అబ్బాయిపై పోలిసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమం మద్యలో ఆపేసి తమ పరువుకు భంగం కల్గించటంతో పాటు.., భారీగా ఖర్చు చేయించినందుకు చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ తీసుకున్న పోలిసులు షౌకత్ పై చీటింగ్ కేసు పెట్టారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more