Tdp bjp disagreements in westgodawari on pawan kalyan birthday

pawan kalyan, pawan kalyan birthday, pawan kalyan marriages, latest news, tollywood news, latest news, renu desai, latest movies, west godawari, palakollu, tdp, bjp, pawan kalyan fans

tdp bjp party leaders and activists clashed each other in palakollu in westgodawari : pawan kalyan fans tdp bjp activists clashed on pawan kalyan birthday

పవన్ బర్త్డ్ డే సాక్షిగా పార్టీల మద్య గొడవ

Posted: 09/03/2014 09:08 AM IST
Tdp bjp disagreements in westgodawari on pawan kalyan birthday

పవన్ పుట్టినరోజు సాక్షిగా టిడిపి-బీజేపి- పవన్ అభిమానుల మద్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చమగోదావరి జిల్లా పాలకొల్లులో మూడు వర్గాల మద్య విభేదాలు బయటపడ్డాయి. పవన్ పుట్టిన రోజు సందర్బంగా పట్టణంలో అభిమానులు రక్తదానం, వృద్ధాశ్రమం, వికలాంగ పాఠశాల విద్యార్థులకు భోజనం, ప్రభుత్వాస్పత్రిలో పండ్ల పంపిణీ, స్థానిక సెంటర్ లో అన్నసమారాధన సహా ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా స్థానిక ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

అయితే ఈ కార్యక్రమానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. తన నియోజకవర్గంలో తనకు ఆహ్వానం లేకుండా జరిగే సన్మాన సభకు ఎలా వెళ్తారని ఎంపీని నిలదీశారు. ఒక్కసారిగా ఈ పరిణామంతో ఎంపీ ఖంగుతిన్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని పాలకొల్లుకు వచ్చినా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఎంపీకి స్వాగతం పలికేందుకు గాంధీ బొమ్మల సెంటర్ కు వెళ్ళిన పవన్ అభిమానులు ఆయన రావటం లేదని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయారు. బైక్ లకు కట్టిన బీజేపీ జెండాలను రోడ్డుపై పడేసిన నిరసన తెలిపారు. సేవా కార్యక్రమాలు, సన్మాన సభపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తే ఎంపీ తమను అవమానించారని మండిపడ్డారు.

అయితే ఎంపీ రాకపోవటానికి ఎమ్మెల్యే రామానాయుడు కారణమని బీజేపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమంలో ఎంపీ పాల్గొనకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారని ద్వజమెత్తారు. అటు విసయం తెలుసుకున్న పవన్ అభిమానులు, స్థానిక నేతలు కూడా కూడా టీడీపీ వైఖరిని తప్పుబట్టారు. గతంలో అనేక సన్మానాలు అందుకున్న ఎమ్మెల్యే.., మరొకరికి సన్మానం జరుగుతుంటే ఇలా ప్రవర్తించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పవన్ ప్రచారం వల్లే టీడీపీ సీమాంధ్రలో గట్టెక్కిందనే విషయం తెలియకుండా వ్యవహరిస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టార్ పుట్టినరోజున తలెత్తిన ఈ వివాదం ఇప్పటితో సమసిపోతుందా.. లేక ఇలాగే కొనసాగుతుందా అనే అంశంపై పాలకొల్లులో చర్చ జరుగుతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  latest news  pawan kalyan fans  tollywood  

Other Articles