Ap government announces good news for unemployed people in andhra pradesh

ap government, andhra pradesh state, chandrababu naidu, yanamala ramakrishnudu, chandrababu yanamala ramakrishnudu, unemployed people, ap budget

ap government announces good news for unemployed people in andhra pradesh : the finance minister of yanamala ramakrishnudu finally announced a clarification about unemployed problem in andhra pradesh.

నిరుద్యోగులకు తియ్యని వార్త ప్రసాదించిన సీఎం!

Posted: 08/23/2014 01:33 PM IST
Ap government announces good news for unemployed people in andhra pradesh

ఇన్నాళ్లవరకు ఉద్యోగులను ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. చివరికి ఒక కమ్మనైనా తియ్యని వార్తను ప్రసాదించింది. నిరుద్యోగులకు ఇకనుంచి నిరుద్యోగ భృతిని కల్పిస్తామని టీడీపీ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయాన్ని ప్రకటించేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్న నేపథ్యంలో నేతలందరూ తలల బాదుకుంటున్నప్పటికీ... వారు మాత్రం నిరుద్యోగులకు కొంత ఉపశమనాన్నే కలిగించారు. శనివారంనాడు వాదోపవాదల మీద ప్రారంభమైన అసెంబ్లీలో నేతల మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సందర్భంలో నిరుద్యోగుల ప్రస్తావన రాగా.. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ప్రకటన జారీ చేసింది.

టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలముందు నిరుద్యోగులకు ఉద్యోగభృతి కింద వెయ్యి రూపాయలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ ఆర్థికమంత్రి మంత్రి యనమల రామకృష్ణుడు ఆ హామీపై స్పష్టతనిస్తూ.. బడ్జెట్ పాస్ అయిన తర్వాత నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే) అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యనమల ఈ ప్రకటన చేశారు. అంతేకాదు.. అంతేకాకుండా, నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు ఏపీపీఎస్సీ బోర్డులో మార్పులు తీసుకువచ్చి ప్రక్షాళన చేస్తామని అన్నారు.

నిరుద్యోగులు ఎంత ఎక్కువగా పెరిగిపోతే.. ప్రభుత్వ ఖజానాపై అంతకంటే ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరలోనే పెట్టుబడులను ఆకర్షించి.. ఏపీలో సరికొత్త పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా కొంతలో కొంతమేరకైనా నిరుద్యోగతిని తగ్గుతుందనే భావంతో టీడీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఏదిఏమైనా.. విభజన అనంతరం ఉద్యోగాల టెన్షన్ లో మునిగిపోయిన నిరుద్యోగులందరికీ తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో వేచి చూడాలి..!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap budget  ap assembly  chandrababu naidu  yanamala ramakrishnudu  unemployed people  

Other Articles