Tv9 sriniraju booked in sathyam scam in sebi charge sheet

satyam scam news, satyam scam sriniraju, satyam scam news, sriniraju latest news, tv9 sriniraju, satyam scam ramalinga raju, sebi charge sheet

tv9 sriniraju booked in sathyam scam in sebi charge sheet

సత్యం స్కాంలో బుక్కయిన టీవీ9 రాజు

Posted: 08/23/2014 12:26 PM IST
Tv9 sriniraju booked in sathyam scam in sebi charge sheet

ఇన్నాళ్లవరకు కనుమరుగైపోయిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం.. తిరిగి తెరమీదకు మరో వివాదంతో వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన ఈ ఈ కంపెనీ.. 2000 సంవత్సరంలోనే అకౌంటింగ్ విభాగంలో కుంభకోణానికి పాల్పడిందంటూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ స్పష్టం చేస్తోంది. ఇదిలావుండగా.. తాజాగా ఈ స్కాంకు పాల్పడినవారి పేర్లలో టీవీ9 ప్రమోటింగ్ సంస్థ ఐల్యాబ్స్ ప్రమోటింగ్, ప్రముఖ ఏంజిల్ ఇన్వెస్టర్ చింతలపాటి శ్రీనివాసరాజు (శ్నీనిరాజు) పేర్లను కూడా ఈనెల తొలినాళ్లలో నమోదు చేసిన ఛార్జిషీటులో చేర్చింది.

దీంతో ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు, శ్రీనిరాజుతోపాటు మరో 13మంది... వారికి చెందిన కొన్ని సంస్థల కుంభకోణం సమయంలో దాదాపు రూ.2000 కోట్లుకుపైగా సంపాదించారని నియంత్రణ మండలి పేర్కొంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే.. ఈ సత్యం స్కాంలో నిందితులుగా పరిగణించబడుతున్న అందరికీ సత్యం ఆర్థిక పరిస్థితి ముందునుంచే తెలుసు! అయినా కూడా వీరు మౌనం పాటిస్తూ.. క్రమంగా తమ వాటా షేర్లను విక్రయించి భారీగా లాభపడ్డారని చార్జిషీట్లో దాఖలైంది. ఒకవేళ ఈ ఆరోపణలు గనుక నిజమైతే మాత్రం వీరందరికి గరిష్టంగా పదేళ్లవరకు జైలుశిక్ష పడే అవకాశం వుంది.

రామలింగరాజు తోడల్లుడైన శ్రీనిరాజు 2003కు ముందు సత్యం బోర్డు సభ్యునిగా వున్నారు. దీంతో ఈ స్కాంలో సెబీ ఈయన పేరును ఏ11గా పేర్కంది. అలాగే ఆయనకు చెందిన సంస్థల చింతలపాటి హోల్డింగ్స్ ను ఏ12గా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ను ఏ13గా చేర్చింది. శ్రీనిరాజు శ్రీనిరాజు, ఆయనకు చెందిన కంపెనీలు కలిసి ఈ సమయంలో సత్యంకు చెందిన 73 లక్షల షేర్లను విక్రయించాయని చార్జిషీటులో తెలిపింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుంభకోణం చోటు చేసుకున్న సమయంలోనే శ్రీనిరాజు తండ్రి దివంగత అంజి రాజు కూడా 2.5 లక్షల సత్యం షేర్లను విక్రయించారని వెల్లడించింది. తద్వారా వచ్చిన నిధుల నుంచే శ్రీనిరాజు టీవీ9 చానల్‌ను స్థాపించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 2004లో టీవీ9 బ్రాండ్‌నేమ్‌తో శ్రీనిరాజు తెలుగు న్యూస్ చానెల్‌ను ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam scam  tv9 sriniraju  sebi charge sheet  

Other Articles