Swastik chicken sandwich gif

sandwich, swastik, chicken sandwich, non veg items, food items, fast food, indian culture, hitler, adalf hitler, nazi, mc donald's, bakery items

swastik symbol appeared in chicken sandwich in carolina city : an employee sacked by complaint that swastik symbol in sandwich

శాండ్ విచ్ లో స్వస్తిక్.., ఉద్యొగి బలి

Posted: 08/13/2014 12:26 PM IST
Swastik chicken sandwich gif

ఉల్లిగడ్డలో ఓం, వంకాయలో అల్లా అనే అక్షరాలను మనం గతంలో అప్పుడప్పుడూ చూశాం. ఇలాంటివి ప్రత్యక్షం అయినపుడు అదృష్టంగా భావించి వాటిని ఇళ్ళలో పెట్టి పూజలు చేసుకున్నట్లు తెలుసు. అయితే ఇప్పుడు శాండ్ విచ్ లో హిందూ సాంప్రదాయానికి ప్రతీక అయిన స్వస్తిక్ గుర్తు వచ్చింది. అయితే ఇందుకు ఎవరూ సంతోషించలేదు. అదృష్టంగా భావించలేదు. పైపెచ్చు దురదృష్టవశాత్తు దీని కారణంగా ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. ఈ సంఘటన జరిగింది మనదేశంలో కాదులెండి. ఎందుకంటే ఇక్కడ జరిగి ఉంటే ఎప్పుడూ ధార్మిక సంస్థలు ఆందోళన చేపట్టి ఆ సంస్థను మూయించేవి.

ఇది జరిగింది కరొలినాలో. మోర్ హెడ్ పట్టణంలో మెక్ డొనాల్డ్ ఫుడ్ స్టోర్ కు వెళ్ళిన ఓ మహిళ చికెన్ శాండ్ విచ్ ఆర్డర్ చేసింది. బాగా ఆకలితో ఉన్న ఆమె ఫుడ్ రాగానే లాగించేయాలని తహతహలాడింది. ఓ పదినిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన శాండ్ విచ్ తన ఎదుటకు రానే వచ్చింది. ఇంకేం ఎంచక్కా ఆరగిద్దాం అని రెడి అయింది. అయితే ఎందుకో బ్రెడ్డు ముక్కలను తెరిచి చూసింది అందులో చికెన్ తో పాటు స్వస్తిక్ రూపం కన్పించింది. అంతే ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిందామె. ఎవడ్రా ఇది తయారు చేసింది అంటూ సర్వర్లపై సీరియస్ అయింది. చివరకు మెక్ డొనాల్స్డ్ హెడ్ ఆఫీస్ కు లేఖ రాసింది. వెంటనే స్పందించిన యాజమాన్యం జరిగిన తప్పుకు చింతిస్తున్నట్లు చెప్పింది. తమను క్షమించాలని కోరింది. మెక్ డొనాల్స్డ్ తరపున క్షమాపణలు కోరిన స్టోర్ మేనేజర్ ఆమెకు మరొక చికెన్ శాండ్ విచ్ ఉచితంగా ఇచ్చాడు. దీంతో శాంతించిన మహిళ క్షమిస్తున్నట్లు చెప్పి చికెన్ తిని వెళ్ళిపోయింది.

స్వస్తిక్ లో ఏముంది?

మనదేశంలో అయితే స్వస్తిక్ చిహ్నం అంటే ధార్మికతకు గుర్తు. అంతేకాదు ఇది ఎన్నికల సంఘం గుర్తు కూడా. అయితే ప్రపంచ స్థాయిలోకి  వచ్చే సరికి మాత్రం స్వస్తిక్ అనేది హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీ గుర్తుగా ఫేమస్ అయింది. ఇదే ఆ మహిళకు కోపం తెచ్చింది. హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీ వల్లనే వేల మంది బలయ్యారని ఆమె తీవ్రంగా బాధపడింది. అలాంటి నాజీ పార్టీ గుర్తును తన శాండ్ విచ్ లో రావటాన్ని భరించలేక సీరియస్ అయింది. దీంతో మనోభావాలను అర్ధం చేసుకున్న మెక్ డి మేనేజ్ మెంట్ క్షమాపణలు చెప్పింది. శాండ్ విచ్ తయారు చేసిన ఉద్యోగిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మనోభావాలు దెబ్బతినటం మనకే కాదు ప్రపంచంలో అందరికీ జరుగుతుందని ఈ ఘటన నిరూపిస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sandwich  mc donald's  swastik  chicken  

Other Articles