Chandrababu warning to ap minister

chandrababu naidu, andhrapradesh ministers, ap assembly, andhrapradesh budget sessions, ap capital, babu warns ministers

chandrababu warns his cabinet minister over comments on capital issue : ap set to start budget sessions from august 18

మంత్రులకు బాబు వార్నింగ్ !!

Posted: 08/11/2014 07:26 PM IST
Chandrababu warning to ap minister

(Image source from: chandrababu warning to ap minister )

ఎవర్నైనా తన ఆదీనంలో ఉంచుకోవటంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి. కుటుంబ సభ్యులైనా, పార్టీ నేతలైనా, చివరకు కేబినెట్ మంత్రులయినా సరే తను చెప్పినట్లు వినాల్సిందే. లేదంటే రాజకీయ చతురుడి చేతిలో దెబ్బ తప్పదని చెప్పాలి. అసలే విభజన తర్వాత లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ర్టాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వైపు పధకాలను అమలు చేస్తూనే రాష్ర్ట నిర్మాణంపై ద్రుష్టి సారించి బిజీగా ఉన్నారు. వీటికి తోడు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఉండనే ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయంతో నడుపుకుంటూ ముందుకెళ్తున్నారు.

ఏపీ కొత్త రాజధానిపై రోజుకో వార్తలు వస్తున్నాయి. వీటికి తోడు మంత్రులు తమ నోటికి వచ్చిన ఊరిపేరు చెప్తూ గందరగోళాన్ని మరింత పెంచుతున్నారు. మంగళగిరి అని ఒకరు, కర్నూలు అని మరొకరు, విజయవాడ దగ్గర్లో అని ఒక మంత్రి చెప్తుంటే.., కాదు కాదు విశాఖ పట్నంలో అని మరొకరు సెలవిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఆగ్రహం వచ్చింది. చూసి చూసి ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ మంత్రులకు బాబు వార్నింగ్ ఇచ్చాడు. రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్నారు. నోరును అదుపులో పెట్టుకోకపోతే తిప్పలు తప్పవని హెచ్చరించారు.
    
ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వంకు తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. 19న సమావేశాలు ప్రారంభించి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక కేబినెట్ భేటిలో ప్రధానమైన రుణ మాఫీ అంశంను ఏ ఖాతాలో చూపాలనే దానిపై మంత్రులతో చర్చించారు. రుణమాఫీ అమలు, హామి ప్రధాన్యతను వివరించాలని నిర్ణయించారు.

ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై కూడా కేబినెట్ బేటిలో చర్చ జరిగింది. ప్రత్యేకాధికారాలను మంత్రులకు బాబు వివరించారు. ఈ సందర్బంగా గవర్నర్ అధికారాలపై ఏపీ కేబినెట్ పలు సందేహాలు వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని 8,9,10, షెడ్యూళ్ళపై క్లారిటీ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా పోలవరం ముంపు మండలాలుగా సీమాంధ్రకు వచ్చిన ఏడు మండలాలకు ప్రత్యేకాధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎంసెట్ కౌన్సిలింగ్ పై సుప్రీం తీర్పును ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం స్వాగతించింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కౌన్సిలింగ్ నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.


RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  ap ministers  andhrapradesh capital  budget sessions  

Other Articles