Telangana msos back step on news channels in telangana state

TV9 And ABN News Channels, TV9 And ABN News Channels published, Telangana msos, telangana msos back step, news channels, telangana state, cm kcr,

telangana msos back step on news channels in telangana state:MSO union of Telangana said that TV9 and ABN officials are threatening them for not telecasting their channels

భయంతో కాదు- ప్రేమతో ప్రసారాలు !

Posted: 08/12/2014 08:25 AM IST
Telangana msos back step on news channels in telangana state

ఆవేశంలో.. ఆలోచన లేకుండా.. !! ఆయన మీద ప్రేమతో.. అపాయం కొనితెచ్చుకొని.. వార్నింగ్ రావటంతో.. వెనక్కి తగ్గి .. మేం భయంతో కాదు.. ప్రేమతో ప్రసారం చేస్తున్నం అని గొప్పగా చెబుతున్నారు.. తెలంగాణ ఎంఎస్ వోలు.
గతం రెండు నెలల నుండి తెలంగాణలో.. టీవీ9-ఏబిఎన్ ఛానల్స్ ను నిషేదం విధించిన తెలంగాణ ఎంఎస్ వోలు సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకరరావు ఆగ్రహించాడని ఆ రెండు ఛానల్స్ ను నిషేదించటం జరిగింది.

కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. ఎక్కడ బహిరంగంగా.. ఆరెండు ఛానల్స్ ను తెలంగాణలో బ్యాన్ చేయమని చెప్పలేదు. కానీ తెలంగాణ ఎంఎస్ వోలు అతి ఉత్సహం కారణంగా.. ఆ ఆరెండు ఛానల్స్ తెలంగాణలో రెండు నెలలు ముగబోయాయి. ఈ విషయం పై ఎన్మో విమర్శలు , మరెన్మో కౌంటర్లు, సెటైర్లు, ఇలా ఒక ఎఫిసోడ్ మాదిరిగా సాగింది.

ఈ ఛానల్స్ పై కోర్టు నోటీషులు ఇచ్చినా.. కేంద్రం లేఖ రాసిన పెద్దగా ఫలితం లేదు. దీంతో రాజ్య సభలో ఈరెండు ఛానల్స్ సౌండ్ ను రాజకీయ నాయకులు మద్య ఘోరమైన యుద్దం జరిగింది. చివరకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అంత గమనించి.. ఫైనల్ వార్నింగ్ ఇవ్వటంతో, తెలంగాణ ఎంఎస్ వోలు .. ఇటు తెలంగాణ సర్కార్, అటు కేంద్రం మద్య నలిగిపోయి, వార్నింగ్ ఎఫెక్ట్ పడకముందే.. కళ్లు తెరుచుకొని, కేవలం భయంతోనో, ఒత్తిళ్లతోనో, మేం ఆ రెండు ఛానల్స్ ప్రసారం చేయటం లేదు. తెలంగాణ ప్రజలకు ఆ రెండు ఛానల్స్ అవసరం కాబట్టి, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి, మేము ప్రేమతో ఆ రెండు ఛానల్స్ ను ప్రసారం చేస్తానమని ‘‘మేక గాంభీర్యం చూపించారు’’.

అయినా ఈ పని అప్పుడే చేసి ఉంటే.. తెలంగాణ ఎంఎస్ వోల పై నిజంగానే ప్రేమ పెరిగి ఉండేది. కానీ ఇప్పుడు ప్రేమతో చేసిన, కోరికతో ప్రసారం చేసిన ఫలితం మాత్రం శూన్యమే!! అయినా దీనిపై కేంద్రంతో మరోసారి చర్చలు జరుపుతామని తెలంగాణ ఎంఎస్ వోలు చెబుతున్నారు. అంటే మళ్లీ ఈ ఎఫిసోడ్ మరి కొన్ని రోజులు.. కొనసాగే అవకాశం ఉందా??? అయినా ఏం జరుగుతుందో చూద్దాం!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles