Minister pydikondala manikyala rao praises to powerstar pawan kalyan

pawan kalyan, chiranjeevi, chiranjeevi 2009 lunch political party, pawan kalyan and tdp, Pydikondala Manikyala Rao, pawan kalyan, endowment minister, powerstar, chandrababu naidu

Minister Pydikondala Manikyala Rao praises to powerstar pawan kalyan: AP Devadaya minister Paidikondala Manikyala rao praised Pawan during a caste meeting in Dwaraka Tirumala

పవన్ తో బాబుకు పవర్ ..చిరుతో గుర్తింపు?

Posted: 08/10/2014 05:16 PM IST
Minister pydikondala manikyala rao praises to powerstar pawan kalyan

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అధికార పవర్ రావటానికి కారణం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణే అని రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలో, సామాన్య ప్రజలు గొంతెత్తి చెబుతున్నాయి. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు!! అయితే ఇప్పుడు కాపులకు గుర్తింపు రావటానికి కారణం అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా అన్నీ రాజకీయ పార్టీలు కాపులపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ.. ఒక గొప్ప సత్యాన్ని బయట పెట్టారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారం వల్లే టీడీపీ అధికారంలోకి రాగలిగిందని, అలాగే, 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాతే... రాష్ట్ర రాజకీయాల్లో కాపులకు తగిన గుర్తింపు వచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పటం జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం కాపు వర్గీయులు దూడుకు స్వభావంతో, దాడులు చేసే వారిగా సమాజంలో ముద్రపడ్డారని, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

రాష్ట్ర విభజన జరగడం వల్లే కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదన వేగవంతమైందని, కలిసి ఉంటే జరిగే పరిస్థితి లేదని సమావేశంలో పాల్గొన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. కాపుల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారని, కాపులను బీసీ చేర్చే ప్రక్రియ కూడా అమలవుతుందని చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles