British skin woman bearded lady showcasing the worlds best facial hair

British skin woman, British Bearded Lady, Bearded Sikh Woman, Harnaam Kaur in photography exhibition, Harnaam Kaur, world best facial hair

British skin woman bearded lady showcasing the worlds best facial hair: - Harnaam Kaur is the only woman in the collection of photographs. ... lady in new photography exhibition showcasing the world's best facial hair

ఎంతందంగా వున్నావే.. ఎవరే నువ్వు?

Posted: 08/10/2014 04:28 PM IST
British skin woman bearded lady showcasing the worlds best facial hair

అందం అంటే అమ్మాయిలదే అని చాలా మంది అంటారు. అయితే అందరు అమ్మాయిలు అందంగా ఉండారు. ప్రతి అమ్మాయికి దేవుడు ఏదోఒక టాలెంట్ ఇస్తాడు. అలాగే కొంతమంది అమ్మాయిలకు కొన్ని ప్రత్యేకతలు ఉండేలా చూస్తాడు. అయితే ఆ ప్రత్యేకతలకు చాలా మంది అమ్మాయిలు ఆందోళన చెందుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అలా కాదు. ధైర్యంగా సమాజంలో తిరుగుతుంది. కొంతమంది అమ్మాయిలు అయితే అస్సలు బయటకు రారు. అలాంటి వారికి ఈ యువతిని చూసి చాలా నేర్చుకోవాలి.

ఈ రోజుల్లో ముఖం కొంచెం ఎయిర్ కనిపిస్తే చాలు.. అమ్మాయిలు వణికిపోతారు. కానీ అలాంటి ఆమె ముఖం నిండా ఎయిరే. గడ్డం పెంచుకున్న మగవారు ఎలా ఉంటారో.. ఈ యువతి కూడా గడ్డంతో అలాగే ఉంది. బ్రిటన్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల భారత సంతతి సిక్కు మహిళ హర్‌నమ్ కౌర్‌కు ఎదురైంది. ఆమెకు 16వ ఏట నుంచీ ముఖంపై వెంట్రుకలు రావడం మొదలయ్యాయి.

Bearded-Sikh-Woman

 

మగవారికి గడ్డం ఎలా వస్తుందో అలాగే ఆమెకూ గడ్డం వచ్చేసింది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమే కారణంగా ఆమెకు ఈ పరిస్థితి ఎదురైంది. టీనేజర్‌గా కౌర్ మొదట్లో ఈ గడ్డంతో చాలా ఇబ్బందులే పడింది. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని మాట్లాడటం.. క్లాత్ కప్పుకుని తిరగడం చేసేది. ఆమె బయటకెళితే అంతా అదో రకంగా చూసేవారు. భయపెట్టేవారు. అసభ్యంగా పిలిచేవారు. దీంతో ఆమె ఎంతో వేదన అనుభవించిందామె. ఈ సమయంలో సోదరుడు గురుదీప్ ఆమెకు ఆసరాగా నిలిచాడు.

ఆమెకు అన్నిట్లోనూ తోడుగా నిలిచాడు. దీంతో ఈరోజు ఆమెలో బెరుకు తగ్గింది. ఓ ప్రై మరీ స్కూల్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ప్రపంచంలో గడ్డం ఉన్న ఏకైక మహిళగా గుర్తింపు సాధించి ఆమెకు ఇప్పుడో అరుదైన అవకాశం దక్కింది. ఇప్పుడు అందరు ఈ యువతి ‘‘ఎంతందంగా వున్నావే ..ఎవరే నువ్వు!! అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు.

ఇప్పుడు ఈ యువతికి ప్రపంచంలోని అత్యుత్తమ గడ్డాల ఎగ్జిబిషన్‌కు ఎంపికైంది. బార్డ్ సీజన్ అనే స్వచ్చంధ సంస్థ ప్రాజెక్ట్ 60 పేరుతో 60 ఉత్తమ గడ్డాల ఫొటోలను ప్రదర్శనకు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రదర్శన త్వరలో లండన్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనకు హర్‌నమ్ కౌర్ ఫొటో ఎంపిక కావడంతో ఆమె మరోసారి వార్తల్లోకొచ్చింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world best facial hair  photography exhibition in world  Bearded Sikh Woman  

Other Articles