Telugu actor suresh comments on cm kcr

telugu actor suresh, actor suresh comments on cm kcr, tollywood hero fire on kcr, telangana cm kcr, telangana state, trs vs bjp,

telugu actor suresh comments on cm kcr: bjp leader suresh comments on telangana cm kcr

టాలీవుడ్ హీరోకి కాలింది-కేసిఆర్ ను తిట్టాడు!

Posted: 08/10/2014 02:24 PM IST
Telugu actor suresh comments on cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూకుడు చూసి చాలా మంది పండగ చేసుకుంటున్నారు. అంతే మంది కేసిఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు. రాజకీయ నేతలతో పాటు.. టాలీవుడ్ హీరోలు కూడా .. కేసిఆర్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సీఎం కేసిఆర్ పై కురిపించిన ప్రేమతో.. టాలీవుడ్ లో వివాదాల వాయగుండం పుట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఒక్కొక్కరు తీరం దాటేందుకు టాలీవుడ్ హీరోలు బయట పడుతున్నారు.

అలాంటి వారిలో.. సీనియర్ నటుడు , బీజేపి లీడర్ ..సురేష్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు. హైదరాబాద్ శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్ చేతిలో పెట్టడమే మంచిదని... దీనిపై కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో అభద్రతాభావంతో ఉండే వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుందని చెప్పారు. దీనిపై రాజకీయాలు చేయడం కేసీఆర్ కు తగదని మండిపడ్డారు. మొదట్లో రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని... ఇప్పుడు 1956కు ముందు అంటూ స్థానికత పేరుతో మరో విభజనకు సిద్ధమయ్యారని అన్నారు. ఇలా టాలీవుడ్ నుండి కేసిఆర్ పై మాటల యుద్దం చేయటానికి సిద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఏమైన కేసిఆర్ ఈజ్ గ్రేట్. ఒకేసారి రాజకీయనేతల్లో, ఇటు పబ్లిక్ లో, మరియు టాలీవుడ్ హీరోల్లో సెగ రగిలించాడు. ఆయన తెలివికి.. అర్థరాత్రి సన్మానం చేయాలని .. నగరంలోని చదువుకున్న యువకులు అంటున్నారు. అయినా.. కేసిఆర్ ఇలాంటివి పట్టించుకోడు.. ఆయన ఉనికి ఏమిటో.. ప్రపంచానికి తెలియాలి అదే కేసిఆర్ గోల్ అని ఆయన అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles