Ebola virus attack in india

Ebola Virus Symptoms, Treatment, Prevention, Ebola virus and Marburg virus Symptoms, Ebola virus disease, Ebola virus, disease, Ebola virus disease news,, Ebola Virus Disease

ebola-virus attack in india: Ebola Virus Symptoms, Treatment, Prevention, Ebola virus and Marburg virus Symptoms, Ebola virus disease, Ebola virus, disease, Ebola virus disease news

ఓరేయ్... నువ్వు చచ్చిపోబోతున్నావ్ రా!

Posted: 08/09/2014 06:55 PM IST
Ebola virus attack in india

త్వరలోనే మీ కళ్ల ముందే కొన్ని వేల ప్రాణాలు భూమిలో కలవబోతున్నాయి. మీరు చూస్తూ కూర్చుంటారా లేక పోరాడుతారా? ఇది కథ కాదు.. నిజం త్వరలోనే భారతదేశాన్ని భయంకరమైన ఎబోలా వైరస్ నాశనం చేయబోతోంది. ఏంటి అర్ధం కావడం లేదా? సరే మీకు అర్ధమయ్యేలా చేబుతాను...

సినిమాల్లో హీరోలు ఫైటింగులు, డాన్సులు, ఏదేనా సాహాసాలు చేస్తుంటే మనకు అలాగే చేయాలని వుంటుంది. సినిమాల్లో హీరో,హీరోయిన్ల స్టైల్స్ ను కాపీ కొడుతూ వుంటాము. కానీ నిజజీవితంలో అలాగే జరగడం చాలా వరకు కష్టం. కానీ సినిమాలు కూడా నిజ జీవితం నుంచే పుట్టినవని మనందరికి తెలిసిందే. మీ అందరికి సూర్య హీరోగా నటించిన ‘సెవెన్త్ సెన్స్’ సినిమా గుర్తుందా?

మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, శృతిహాసన్ జంటగా నటించిన ‘సెవెన్త్ సెన్స్’ సినిమా తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో భోధిధర్మ అనే వ్యక్తి తన రాజ్యాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత అనుకోకుండా చైనా దగ్గరకు తన ప్రయాణం ఆగిపోతుంది. అక్కడ అనుకోకుండా ఒక వింత వ్యాధి అక్కడివారిని భాధిస్తూ వుంటుంది. ఆ వ్యాధి సోకిన వ్యక్తిని బ్రతికుండగానే శరీరం కనిపించకుండా ఒక బట్టతో చుట్టేసి, తీసుకెళ్లి అడవిలో పాడేసి వస్తారు. ఇలా ఈరోజుకు ఎంతో మంది చనిపోతూ వుంటారు. ఆ వ్యాధి వచ్చిన వారి శరీరం నుంచి రక్తం కారడం వంటి జరుగుతూ వుంటుంది.

అయితే ఈ సంఘటనను చూసిన భోధిధర్ముడు వారికి అండగా నిలిచి, ఆ వింత వ్యాధికి మందు కనిపెడతాడు. ఆ వ్యాధి మళ్లీ ఆ ప్రాంత ప్రజలకు రాకుండా చేసి, ఆ వైద్యకళను వారికి కూడా నేర్పిస్తుంటాడు. అయితే వారికి వైద్య కళను మాత్రమే కాకుండా శత్రువుల బారి నుండి ఎలా కాపాడుకోవాలో యుద్ధ విద్యను కూడా నేర్పిస్తాడు భోధిధర్ముడు. అంత బాగానే వుందనుకుంటే... ఆ భోధిధర్ముడిని తమ ప్రాంతంలోనే సమాధి చేస్తే తమ ప్రాంతానికి ఎలాంటి వ్యాధులు సోకవనే వుద్దేశ్యంతో.. భోధిధర్ముడికి అన్నంలో విషం పెడతారు. ఈ విషయం భోధిధర్మ తెలుసుకొని సంతోషంగా ఆ విషం తింటాడు. తర్వాత అతడి శవాన్ని వారి ప్రాంతంలోనే పూడ్చి పెడతారు.

ebola-virus-attacked

ఇక సీన్ కట్ చేస్తే.... కొన్ని ఏళ్ల తర్వాత చైనా వాళ్లు ఈ వ్యాధి యొక్క వైరస్ ను కనిపెట్టి, దానికి సంబంధించిన విరుగుడు మందును కనిపెట్టి... ఈ డెంజరస్ వైరస్ ను ఇండియాలో వ్యాప్తి చేయాలని అనుకుంటారు. ఒకవేళ ఇండియాలో ఈ వ్యాధి వ్యాప్తి అయితే... విరుగుడు మందు కోసం చైనాను ఇండియా చేతులు జోడించి అడుక్కుంటదనే వుద్దేశ్యంతో ఆ వైరస్ ను ఇండియాలో వ్యాప్తి చేస్తారు. కానీ ఆ సినిమాలో భోధిధర్ముడి డిఎన్ఏ ను ఒక వ్యక్తిలో కనుగొని.. ఆ వ్యాధికి విరుగుడు కనుక్కొని ఆ వ్యాధిని శాశ్వతంగా నాశనం చేస్తారు. ఆ భోధిధర్ముడు కూడా ఒక భారతీయుడే.

ఇదంతా సినిమా స్టోరీ. కానీ ఇపుడు ఇదే పరిస్థితి నిజ జీవితంలో కూడా జరుగుతుంది. రోజుకు కొన్ని లక్షలు ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వైరస్ చాలా దగ్గర సంబందం ఉన్న ఎబోలా వైరస్ ప్రపంచం పై దాడి చేస్తుంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సంపన్న దేశాలు ఎబోలా పేరు వింటేనే గజగజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒక్కసారి సోకిందంటే ప్రాణాలను హరించేదాకా విశ్రమించని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంగా 2000 మంది మృత్యువాత పడగా, ఆగస్టు నెలలో ఇప్పటి వరకు 300 మందిని పొట్టనపెట్టుకుంది. ఇలా రోజుకి ఎబోలా వైరస్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు ‘‘సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఎబోలా వైరస్ నుండి ఏ భోధిధర్ముడు కాపాడుతాడు? మన రాజకీనాయకులు, అధికారులు పని తీరు చూస్తే .. మనకు ఎబోలా వైరస్ వలన మరణ గంటలు మోగుతాయనిపిస్తుంది. సొంతలాభం చూసుకొనే నేతలు, అవినీతి ప్రాణం పోసే అధికారులు ఉన్నంత కాలం.. ఇలాంటి ఎబోలాంటి వైరస్ లు మానవ జాతిపై ఎటాక్ చేస్తునే ఉంటాయి.

ప్రకృతి పగబడితే.. మానవాళికే ప్రమాదకరం అనేవి విషయాన్ని అనేక విధాలుగా.. సంకేతాలు ఇవ్వటం జరిగింది. అయినా మానవుడు ప్రకృతిలో పుట్టే భయకంరమైన వైరస్ ను చంపుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఎయిడ్స్, డేంగ్యూ, మలేరియా, స్వైన్ ప్లూ (హెచ్1 బి1) , ఆంత్రాక్స్ లాంటి వైరస్ వ్యాదులతో.. మానవుడు.. పోరాటం చేస్తునే ఉన్నాడు. అయితే ఇప్పుడు ‘‘ఎబోలా’’అనే వైరస్ మానవజాతిని సర్వనాశనం చేయటానికి సిద్దమైంది. ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ ను అడ్డుకోవటానికి .. మానవుడి వద్ద ఎలాంటి ఆయుధం లేదు.

అసలు ఎబోలా వైరస్ అంటే ఏమిటి?

కంటికి కనిపించన వైరస్ ..ఒకటి గబ్బిలాల నుంచి ఈ ఎబోలా వైరస్ గా మారి వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఎబోలా వైరస్ వ్యాది లక్షణాలు :

* ఎబోలా వైరస్ వ్యాది కోతులు, గోరిల్లాలు, చింపాంజీలు మరియు మానవులకు ఈ వైరస్ త్వరగా సోకుతుంది.
* ఎబోలా వైరస్ సోకిన జంతువులు/మనిషిలో .. రక్తం స్రావాలు, శరీర అవయవాలు ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
* ఎబోలా వైరస్ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందటానికి, బాధితుడి యొక్క రక్తం, మూత్రం, లాలాజలం, అతని వాడిన వస్తువులు మరియు వీర్యం ద్వారా మరోకరికి వ్యాది సోకుతుంది.
* ఎబోలా వైరస్ కేసుల్లో 90 శాతం ప్రమాదకరమైనవి. కానీ ఈ వైరస్ కు టీకా లేదు మరియు ఎలాంటి చికిత్స లేదు.
* ఎబోలా వైరస్ సోకిన బాధితుడిలో.. చర్మం పగుళ్లు రావటం జరుగుతుంది. ఆ బాధితుడు కోసం ప్రత్యేకంగా నార దుస్తులు, మంచం, సూదులు ఊపయోగించాలి.
* ఒక వేళ ఎబోలా వైరస్ వ్యాది నుండి కోలుకున్న వ్యక్తి, ఏడు వారాల తరువాత.. అతని వీర్యం ద్వారా అతని భాగస్వామికి ఎబోలా వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

వైరస్ ప్రమాదం ఎవరికి ఎక్కువుగా ఉంటుంది?

* ఒకే సమయంలో వైరస్ ప్రమాదం ఉంటుంది..
* ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది.
* వ్యాది సోకిన వ్యక్తికి అతి సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యులకు, లేదా ఇతరులకు , పక్కింటి వారికి..
ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి మరణించిన బాధితులకు, ఆయా మృతదేహాలకు ప్రేమతో సంతాపం తెలిపిన వారికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్ తో చనిపోయిన జంతువులను తిన్న వేటగాళ్లు వచ్చే అవకాశం ఉంది.

ఎబోలా వైరస్ లక్షణాలు మరియు చిహ్నాలు ఏమిటి?
ఎబోలా వైరస్ వ్యాధి సోకిన బాధితుడిలో.. తీవ్రమైన జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, మరియు గొంతు నొప్పి, అతిసారలా వాంతులు కావటం, శరీరం పై దద్దర్లు, మూత్రపిండాలు బలహీనపడటం, మరియు కాలేయం పనిచేయకపోవటం, మరియు అంతర్గత బాగాల్లో రక్తస్రావం కావటం జరుగుతుంది.
ఇలాంటి లక్షణాలు చూపించి 21 రోజుల మద్య వ్యవదిలో.. వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.

ebola-virus-doctors

వైద్యుని సంరక్షణలో ఉండాలి?

ఒక ప్రాతం, లేదా ఒక వ్యక్తి ఎబోలా వైరస్ ఉందని అనుమానం వచ్చిన వెంటనే వైద్యుడి సహయం తీసుకోవాలి.

ఎబోలా వైరస్ కు చికిత్స ఏమిటి?

వ్యాధి సోకిన బాధితుడికి ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ తీసుకోవాలి. వ్యాది తీవ్రతను బట్టి, ఇంట్రావీనస్ బలమైన ద్రవాలు ఇస్తూ ఉండాలి.
అయితే ఈ వైరస్ కు ఖచ్చితమైన చికిత్స లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. వ్యాది నుండి బయటపడే అవకాశం ఉంది.

ఎబోలా వైరస్ ను ఎలా నివారించవచ్చు?
ఎబోలా వైరస్ ను నివారించటానికి ప్రస్తుతం ‘ఏ లైసెన్స్ టీకా ఉంది.’ దీనిపై అనేక పరీక్షలు జరిపారు. కానీ ఇంకా వైరస్ బాధితుడికి ఇచ్చే విధంగా . ఈ టీకా అందుబాటులోకి రాలేదు. ఈ టీకాను వైద్య ఉపయోగం కోసం తీవ్రమైన పరీక్షలు చేస్తున్నారు.

వ్యాది సోకిన ప్రాంతాలలో ప్రయాణం చేయటం సురక్షితమా?
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం, వ్యాదిసోకిన ప్రాంతాలల్లో ఆంక్షలు పెట్టిన చోట ప్రయాణం చేయకూడదని సిపోర్సు చేసింది. బాధితుల నుండి ప్రయాణికులకు సంక్రమించే వ్యాధిలో చాలా తక్కువ ప్రబావం ఉంటుంది. ఇప్పుడ ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది.

భయంకరమైన వైరస్‌
ఈ ప్రపంచంలో జలుబు, క్షయ వంటి పలు వ్యాధులు వైరస్‌ల వల్ల వస్తాయన్న సంగతి తెలుసుకదా! వీటిలో 'ఎబోలా' అనబడే వైరస్‌ ఎంత ప్రమాదకరమైనదంటే ఇది తన ప్రతాపాన్ని చూపించగలిగే ప్రతి ఐదుగురు మనుషుల్లో నలుగురిని చంపివేయగల్గుతుంది.

అయితే మన నేతలు ఏమంటున్నారో తెలుసా?

ebola-virus-india

మనం ప్రమాదం జరిగిన తరువాత ప్రయోగాలు చేస్తాం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్షన్ గుర్తు చేశారు. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిందే. ఎబోలా భారత్ వైపు వేగంగా వస్తుందని కొన్ని దేశాలు .. ముందస్తు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఆయా దేశాలు .. ఎబాలో వైరస్ ను తమ దేశం ప్రజలకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ మన దేశంలోని అధికారులు, మంత్రలు.. ‘ఎబోలా’ వైరస్ పై చావు సలహాలు ఇస్తున్నారు.

‘‘ప్రమాదం పది అడుగుల దూరంలో ఉంది .. కాపాడండి అని అంటే..’’ పర్వలేదు .. పది అడుగులు దూరంలో ఉందిగా ఎలాంటి నష్టం జరగదులే.. అని ఏసీ గదుల్లో ఉండి.. మీడియా ప్రకటనలు చేస్తారు. ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కూడా అదే అంటున్నారు.

శరవేగంతో విస్తరిస్తున్న ఎబొలా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, భారత్ లో ఎబోలా కేసులేవీ నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఎబొలా ప్రభావిత దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిపై పరిశీలన ఉంటుందని తెలిపారు.

అయ్యా మంత్రి గారు.. ఎబోలా వైరస్ అనేది .. నేను వస్తున్నా మీరు జాగ్రత్త అని చెప్పి రాదు. ఒకవేళ ఎబోలో వైరస్ ఎటాక్ చేసిన తరువాత మనిషి ప్రాణం .. కొన్ని రోజులే. !! ఎబోలా వైరస్ అర్థరాత్రి అరవై కిలో మీటర్ల వేగంతో వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. మీరు ఇలా నిమ్మకు నీరుపట్టిన ఉంటే.. ప్రమాదం జరిగిన తరువాత .. లెక్కలు వేయటానికి అధికారులు కూడా కరువవుతారు. థటీస్ ఎబోలా వైరస్..!! భారత్ ప్రజలు బీ కేర్ పుల్..!!

Rebba's

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ebola virus  Ebola virus disease  

Other Articles