Jupudi prabhakara rao says goodbye to ys jagan party

jupudi prabhakar rao mlc, jupudi prabhakar rao reveal allegation on jagan party, jupudi prabhakar rao allegation on jagan party, jupudi prabhakar rao fire on subbareddy,

Jupudi Prabhakarao says goodbye to ys jagan party: YSRCP spokesperson and MLC Jupudi Prabhakar Rao is likely to leave ... But Jupudi's goodbye to the party turned out to be an interesting

జగన్ కు జూపూడి బిగ్ షాట్ !

Posted: 08/09/2014 06:28 PM IST
Jupudi prabhakara rao says goodbye to ys jagan party

వైఎస్ జగన్ బిగ్ షాట్ తగిలింది! ఇప్పటికే చిన్న చిన్న షాట్ తగిలిన పెద్దగా పట్టించుకోలేదు. కానీ జగన్ ఉంటే.. పక్కనే జూపూడి ఉంటాడని తెలుసు. ఒకనోక సమయంలో.. జగన్ నీడ .. జూపూడి అని రాజకీయ నేతలు జోకులు వేసుకున్నారు. వైసీపీలో జూపూడి ప్రభాకర్ దిన.. దినం పెరుగుతుందని ఆయన అభిమానులు అనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్ అంటేనే జూపూడి..చిరాకు పడుతున్నాడు. అవసరమైతే.. కామెంట్లు చేయటానికైన సై అంటున్నారు. ఇంతకీ విషయం ఏమింటే.. జగన్ కు జూపూడి బిగ్ షాట్ రుచి చూపించాడు.

వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ ఈరోజు మీడియా ముందు .. జగన్ పార్టీలో జరిగిన నేరాలు, ఘోరాలు గురించి చెప్పటం జరిగింది. జూపూడి మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోయిన తర్వాత రాజకీయాల్లో ఎవరూ తోడులేని వ్యక్తిగా మిగిలిపోయిన వైయస్ జగన్ కు అండగా ఉండాలనే వైకాపాలో చేరానని జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ లు తనకు తోడుగా ఉంటామని చెప్పినా... రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే జగన్ వెంట నడిచానని తెలిపారు.

వైయస్ మరణం సహజం కాదని... కుట్ర అని మొదట చెప్పిన వ్యక్తిని తానే అని చెప్పారు. కానీ, ఆ తర్వాత వైకాపాలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయిని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను అరెస్ట్ చేసిన రోజున వైయస్ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టారని... ఆ రోజున వారి కుటుంబ సభ్యులతో పాటు తాను, సబ్బం హరి మాత్రమే ఉన్నామని వెల్లడించారు.

దీనికి సంబంధించి అందరిపై కేసు నమోదయిందని... ఆరుగురు వ్యక్తుల (విజయమ్మ, భారతి, షర్మిల, భారతి తండ్రి, తాను, బ్రదర్ అనిల్)కు సమన్లు తీసుకుని వచ్చిన కానిస్టేబుల్ తో జూపూడి ఎవరో తమకు తెలియదని వైయస్ భారతి తండ్రి సుబ్బారెడ్డి చెప్పారని తెలిపారు. ఈ విషయం చెబుతున్నప్పుడు జూపూడి స్వరం బొంగురుపోయింది. తానెవరో తెలియదనడం తననెంతో బాధించిందని అన్నారు. ఆ తర్వాత వారందరూ కలసి ఓ లాయర్ ను పెట్టుకున్నారని... తాను విడిగా మరో లాయర్ ను పెట్టుకున్నానని వెల్లడించారు.

జగన్ పార్టీలోని నేతలకు విలువ లేదు:

వైకాపాలో వైయస్ బంధువులకు తప్ప మరో నేతకు విలువ లేదని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మనసు చంపుకుని ఇంతకాలం కొనసాగానని, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేశానని చెప్పారు. ఇకపై వైకాపాలో కొనసాగలేనని... పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

వైఎస్సార్సీపీ నేతల మధ్య అభద్రతా భావం నెలకొందని జూపూడి తెలిపారు. ఏ ఇద్దరు నేతలూ మాట్లాడుకునే పరిస్థితి పార్టీలో లేదని చెప్పారు. నేతలను గౌరవించే సంప్రదాయం వైకాపాలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభద్రతా భావం కలిగిన నేతలతో కూడిన పార్టీ ఎంతో కాలం మనలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

జిల్లాలను జగన్ కుటుంబ సభ్యులు
తన రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించానని జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. వైకాపాలో నేతల మధ్య సఖ్యత లేదని అన్నారు. ఇప్పటికీ కీలక నేతలైన బాలినేని, వైవీ మాట్లాడుకోరని వెల్లడించారు. వైయస్సార్ పార్టీ రాజరిక పాలనను తలపిస్తోందని... సామంత రాజులకు అప్పగించినట్టు కుటుంబసభ్యులకు జిల్లాలను అప్పగించారని ఎద్దేవా చేశారు. జగన్ కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని... అయినా తనను దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే జగన్ పార్టీ నుండి.. జూపూడి పై ఎలా దాడి చేస్తారో.. రేపటి న్యూస్ లో చూద్దాం.!! ఆ పార్టీ కొత్తపల్లి గీతపై.. ఫేస్ బుక్ దాడి, మరీ జూపూడి పై...????????

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles