Kcr no comments on tv9 abn news channels

telangana cm kcr latest news, cm kcr tv9 abn andhra jyothy news channel, lok sabha meeting, kcr latest press meet, kcr no comments news channels, trs party mps, tv9 abn news channels telecast

Kcr no comments on tv9 abn news channels : telangana cm kcr is not giving clarification about tv9 and abn andhra jyothy news channels telecast

‘‘టీవీ9-ఏబీఎన్’’ ఛానెళ్ల మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదట!

Posted: 08/04/2014 06:07 PM IST
Kcr no comments on tv9 abn news channels

‘‘రానురాను మీడియా ప్రసారాల్లో రాజకీయ నాయకుల మితిమీరిపోయే రీతిలో కామెంట్లు చేస్తున్నారని.. అటువంటి ఛానెల్స్ పై ఆంక్షలు విధిస్తామని’’ తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈయన ఈ మాట చెప్పడం ఆలస్యం... త్వరలోనే టీవీ9 - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెళ్ల ప్రసారాలను ఆపేశారు. సదరు ఛానెళ్లు తెలంగాణ నేతలను ఉద్దేశించి వ్యంగ్యంగా కామెంట్లు చేయడంతోపాటు అవమానపరిచాయని వాటి ప్రసారాలను తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేయడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఆయన మాత్రం ఇంతవరకు తెరముందు నోరు మెదపకుండా తన పని తాను కానిస్తున్నట్టు కనిపిస్తోంది.

టీవీ9 - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్ల నిలిపివేత విషయంలో చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర లేఖ రాసినా.. పలువురు ప్రముఖులను నిలదీసినా.. కేసీఆర్ మాత్రం ఏమీ స్పందించకుండా ఊరికే వుండిపోయారు. అప్పట్లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం కోరితే.. దానికి సమాధానంగా ‘‘ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసింది ఎంఎస్ఓలు.. వారి నిర్ణయంతో మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు’’ అని ప్రకటించారు. ఆ తరువాత కూడా ఈయన ప్రశ్నలు అడిగిన ప్రతిఒక్కరికీ ఇలాగే సమాధానం ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ అంశం ఇప్పుడు లోక్ సభలో చర్చకు వచ్చే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ కూడా తన పార్టీ ఎంపీలు ఎలా వ్యవహరించాలోనని కేసీఆర్ చర్చలు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి.

ఛానెళ్ల ప్రసారం వ్యవహారం శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ పరిధిలో వున్నాయని... ఎంఎల్ఓల నిర్ణయంతోనే ఆ ఛానెళ్లను బంద్ చేశారే తప్ప.. ఆ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని స్పష్టం చేయాలని ఆయన తమ పార్టీ ఎంపీలను కోరినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. కేసీఆర్ ఈ ఛానెళ్ల విషయంలో వెనక్కు తగ్గేలా కనిపించడం లేదంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వస్తుందో.. కేసీఆర్ దీని మీద ఎలా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles