High court judge orders junior woman judge item song

madhya pradesh high court judge, woman judge item song, high court judge misbehave with woman judge, high court judge vulgar messages woman, madhya pradesh high court judge physical harassement, madhya pradesh high court news

High court judge orders junior woman judge item song : Madhya pradesh High court judge vulgarly behaved with woman sessions judge to do an item song in his bunglow and called her to come single with hot dress

మహిళా జడ్జిని ‘‘ఐటెం సాంగ్’’ చేయాలంటూ హైకోర్టు జడ్జి ఆదేశం!

Posted: 08/04/2014 04:34 PM IST
High court judge orders junior woman judge item song

మీరు ఈ విషయాన్ని ఎంత నెగ్లెక్ట్ చేసినా.. ఇది మాత్రం జగమెరుగని సత్యం! సాక్షాత్తూ హైకోర్టు జడ్జి ఒక మహిళా జడ్జిని ‘‘ఐటెం సాంగ్’’ చేయాలంటూ కోరాడు. ఇంతేకాదు.. తన ఇంటికి ఒంటరిగా రావాలని.. ఎవరూ లేని సమయంలో కలవాలంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆ మహిళా జడ్జిని నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. అసభ్యపదజాలంతో పలకరించేవాడు. ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా వుండే ఫోటోలను పంపించాలంటూ మానసిక ఉద్వేగానికి గురిచేసేవాడు. దీంతో ఆ మహిళా జడ్జి తన పదవికి రాజీనామా చేసి.. తనతో జరిగిన అన్యాయాన్ని ఇలా బయటపెట్టేసింది. మధ్యప్రదేశ్ లో ఓ సీనియర్ జడ్జి, అడిషనల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న మహిళను వేధించిన సంఘటన ఇది!

ఢిల్లీ కోర్టులలో 15ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేసిన అనంతరం.. మధ్యప్రదేశ్ హయ్యర్ జుడీషియల్ సర్వీస్ పరీక్ష రాసి 2011లో గ్వాలియర్ లో ఆమె పోస్టింగ్ పొందారు. శిక్షణ తరువాత 2012 చివర్లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా గ్వాలియర్ లో పోస్టింగ్ పొందారు. ఆ తరువాత 2013లో విశాఖ కమిటీకి జిల్లా చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఆమె చేసిన పనితీరుకి మెచ్చి 2014లో అద్భుతంగా పనిచేస్తోందని ఒక నివేదిక కూడా పేర్కొంది. ఇంతవరకు బాగానే సాగుతున్న ఆమె జీవితంలోకి ఓ సీనియర్ జడ్జి తన జీవితంలో ఒక రాక్షసుడిలాగా ప్రవేశించాడు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి... ఆ మహిళా జడ్జిని ఒంటరిగా తన బంగ్లాకు రావాల్సిందిగా కోరేవాడు.

ఇంతేకాదు.. తన ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఒంటరిగా రావాలని.. ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేయాలని సందేశాలు కూడా పంపించాడు. అయితే తన కూతురి పుట్టనిరోజు వున్న కారణంగా తాను ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయింది ఆ మహిళా జడ్జి! దాంతో ఆ న్యాయమూర్తి తర్వాతి రోజు.. ‘‘ఒక సెక్సీ, అందమైన ఫిగర్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేయడాన్ని మిస్ చేసుకున్నాను. అది ఎలాగైనా చూడాలని నేను కోరుకుంటున్నాను’’ అంటూ మెసేజ్ చేశాడు. కానీ ఆమె తన మాట వినకపోవడంతో రకరకాలుగా వేధించడం మొదలుపెట్టేశాడు. దీనిని భరించలేక ఆమె తన భర్తతో కలిసి ఆ న్యాయమూర్తిని కలిసేందుకు వెళ్లగా.. తన భర్తను చూసిన వెంటనే తనకు కోపం వచ్చింది. ఆమెను 15రోజుల తర్వాత వచ్చి కలవమన్నాడు. కానీ అంతలోనే ఆమె పోస్టింగ్ అక్కడి నుంచి బదిలీ చేసేశారు.

నాకు సీనియర్ ఇంటర్ చదువుతున్న ఒకమ్మాయి వుంది.. మధ్యలోనే బదిలీ అంటే తన జీవితం నాశనం అవుతుందని ఆమె ఆ న్యాయమూర్తిని ఎంతగానో వేడుకుంది. కానీ అతను మాత్రం పట్టించుకోలేదు. తనను ఎందుకు బదిలీ చేశారని ఆ మహిళా జడ్జి అడిగితే.. తాను కనీసం ఒక్కసారి కూడా బంగ్లాకు రానందుకు తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేస్తానని ఆ క్రూరమైన జడ్జి వాపోయాడు. ఇలా చేసినందుకు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించాడు కూడా! ఇతని వ్యవహారం మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చెప్పేందుకు ప్రయత్నించినా.. అందుకు ఆయన కూడా తిరస్కరించాడు. ఇక ఆ మహిళా జడ్జి ఏమి చేయలేక జ్యుడిషియల్ సర్వీస్ కు రాజీనామా చేయాల్సి వచ్చిందని తాను చేసిన ఫిర్యాదులో తెలిపింది.

ఈమేరకు ఆ మహిళా జడ్జి తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిల్ అనిల్ రమేష్ దవే,  జస్టిస్  దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాల్సిందిగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంటూ.. వేడుకుంది.

ఇది మన భారతదేశంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు! ఒక హైకోర్టు జడ్జి అయి కూడా జూనియర్ జడ్జిని లైంగికంగా వేధించడం నిజంగానే భారత రాజ్యాంగానికి సిగ్గుచేటు! రానురాను మన బారతదేశంలో మహిళల మీద అన్యాయాలు జరుగుతూనే వున్నాయే తప్ప.. అవి తగ్గడం లేదు. ఎంతటి ఉన్నత స్థానంలో అయినా సరే... ఎంతటి తక్కువ స్థానంలో అయినా సరే... చిన్నాపెద్దా అని తేడా లేకుండా అరాచకాలు చేస్తున్నారు మానవమృగాలు! మహిళల మీద ఈ అత్యాచారాలు ఇంకెన్నాళ్లంటూ మహిళా సంఘాలు, యువతలు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ.. రాస్తారోకోలు నిర్వహిస్తున్నా.. భారత ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన రావట్లేదు! ఈ అన్యాయాలు ఇంకెన్నాళ్లవరకు!!!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles