Telangana people angry to telangana state cm kcr

anndhra leaders, andhra leaders rule, cm kcr rule, telangana cm kcr, tealangana state people angry, medak people fire on kcr, medak people angry to cm kcr, pocharam project, nizamabad district, Telangana, kcr, andhra leaders ruling, mamilla anjaneyulu

telangana people angry to telangana state cm kcr: medal district people fire on telangana state cm kcr rule

విడిపోయి పెద్ద తప్పు చేశాం? తెలంగాణ ప్రజలు

Posted: 08/02/2014 03:13 PM IST
Telangana people angry to telangana state cm kcr

‘‘దూరపు కొండలు నునుపు’’ అనే విషయన్ని మరిచిపోయి జై తెలంగాణ అన్నందుకు మా బతుకులు చీకటి బతుకులు అవుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా ప్రజలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆంద్ర నేతల మీద, కేంద్రం మీద పైట్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాం.. కానీ ఆ ఆనందం నాలుగు రోజుల్లో ఆవిరైపోయిందని మెదక్ జిల్లా వాసులు అంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన కంటే.. ఆంధ్ర నాయకుల పాలనే చాలా బాగుందని డీసీసీ ఉపాద్యక్షుడు మామిళ్ల ఆంజనేయులు అన్నారు. మెదక్ -నిజమాబాద్ జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు తో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని తెలంగాణ సిఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు.

ఇప్పుడ సీఎం కేసిఆర్ తొందరపాటు నిర్ణయంతో మెదక్ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆంజనేయులు అంటున్నారు. ఒకవేళ ప్రాజెక్టు ఎత్తు పెంచితే మెదక్ జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది, అంతేకాకుండా పోచారం ప్రాజెక్టును నిర్మించటంతో మెదక్ మండలంలోని మిరుగుడుపల్లి అనే గ్రామం కనుమరుగైందని ఆయన అన్నారు.

మళ్లీ పోచారం ప్రాజెకట్ ఎత్తుపెంచితే మండలంలోని భూర్గుపల్లి, వాడి, రాజిపేట , గాజిరెడ్డిపల్లిలు పూర్తి వరద ముంపునకు గురికావాల్సి వస్తుందని అన్నారు. మెదక్ జిల్లా ప్రజలు మునిగిపోతునే.. నిజామాబాద్ జిల్లా ప్రజలకు నీరు ఇవ్వటం జరుగుతుందని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ది కోసం మెదక్ జిల్లా ప్రజల ను బలితీసుకోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles