బెంగళూరులో విబ్గ్యోర్ స్కూల్లో 6 సంవత్సరాల బాలిక మీద జిమ్ శిక్షకులు జరిపిన అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసారు. అయితే నేరస్తులు ఇంకా అందరూ పట్టుబడలేదని, ఇంకా ఆ స్కూల్ లో తన పిల్లలను ఉంచటం క్షేమం కాదని అంటున్నారు కొందరు పేరెంట్స్.
జరిగిన ఘటన మీద పెద్ద ఎత్తున నగరంలో నిరసన, ముఖ్యమంత్రి సిద్దరామయ్య దగ్గర్నుంచి కూడా ఒత్తిడి పెరగటంతో అంతకు ముందు కూడా ముస్తాఫా అనే ఒక జిమ్ ఇన్ స్ట్రక్టర్ ని అరెస్ట్ చేసారు. అతని ల్యాప్ టాప్ లో చిన్న పిల్లల మీద జరిగిన రేప్ ల వీడియోలున్నాయి. అతని గురించి అతను పని చేసిన పాత స్కూల్ లో విచారించామని, అతని ప్రవర్తన బాగోలేకనే అతన్ని తీసేసామని చెప్పారని పోలీస్ ఛీఫ్ ఎమ్ ఎన్ రెడ్డి అన్నారు. అతను అనవసరంగానే పిల్లలను టచ్ చేస్తుండేవాడట. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.
పోయిన వారం జరిగిన అరెస్ట్ తర్వాత సోమవారం తిరిగి స్కూల్ ని తెరిచిన యాజమాన్యం భద్రతా ఏర్పాట్లను బాగా పెంచామని, 110 సిసి కేమెరాలను ఏర్పాటు చేసామని చెప్పారు. అయినా పేరెంట్స్ కి నచ్చచెప్పటం స్కూల్ యాజమాన్యానికి కష్టంగానే ఉంది.
ముస్తాఫా విషయంలో కూడా స్కూల్ యాజమాన్యం తప్పిదాన్ని పేరెంట్స్ ఆరోపించారు. అతను పనిచేసిన పాత స్కూల్ లో ఏం జరిగింది, ఎందుకతన్ని అక్కడినుంచి తీసేసారు అన్న విషయాన్ని అతన్ని ఉద్యోగంలో పెట్టుకునేముందు ఎందుకు విచారించలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకటో తరగతి చదువుతున్న అమ్మాయి ప్రవర్తన క్లాస్ లో సరిగ్గా లేదంటూ పనిష్మెంట్ గా ఆ అమ్మాయిని క్లాస్ లోంచి బయటకు పంపించిన స్కూల్ టీచర్ ఆ అమ్మాయి భద్రత గురించి ఎందుకు ఆలోచించలేదని అడుగుతున్నారు. అలా బయటకు పంపించి ఒక జిమ్ కి సంబంధించిన స్టోర్ రూంలో ఉంచిన ఆ అమ్మాయి మీద ఇన్ స్ట్రక్టర్లు అత్యాచారం చేసారని అభియోగం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more