Wb high court orders cid file fir on tapas pal

Tapas Pal controversial remarks, Tapas Pal TMC MP, Tapas Pal actor turned politician, High court order CID FIR Tapas Pal, FIR on Tapas Pal, Mamata Benarjee pardons Tapas Pal

WB High Court orders CID File FIR on Tapas pal: Tapas Pal actor turned politician controversial video

తపస్ పాల్ మీద ఎఫ్ఐఆర్ కి హైకోర్ట్ ఆదేశం

Posted: 07/29/2014 01:48 PM IST
Wb high court orders cid file fir on tapas pal

తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన తపస్ పాల్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యవలసిందిగానూ, దర్యాప్తు చెయ్యవలసిందిగానూ కల్ కత్తా హైకోర్ట్ సిఐడి ని ఆదేశించింది.  ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ఇంతవరకు ఎటుంటి ప్రకటనా చెయ్యలేదు.  

జూలై 2 న దావానంలా వ్యాపించి చెలరేగిన తపస్ పాల్ వీడియోలో ఆయన ఎన్నికల సమయంలో చౌమాహా గ్రామంలో మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ వీడియోలో ఒక వర్గం వారిని చంపుతానని, వాళ్ళ ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయిస్తానని తపస్ పాల్ చెప్పటం జరిగింది.

తపస్ పాల్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకునే ప్రకటన చేసారని హైకోర్ట్ భావించింది.  ఈ విషయాన్ని తెలియజేసిన జస్టిస్ దీపంకర్ దత్తా, ఇలాంటి అనాచారాన్ని మొగ్గలోనే త్రుంచివెయ్యకపోతే రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని అన్నారు.  ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తపస్ పాల్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకపోవటాన్ని కూడా కోర్డ్ తప్పుపట్టింది.  

తపస్ పాల్ సినిమాల్లో నటించి సమాజంలో ఒక గుర్తింపును పొందినవారని, ఎంపీగా గెలిచినవారని, అందువలన ఆదర్శప్రాయంగా ఉండదగ్గవారని కూడా కోర్టు ఆశించింది.  

ఈ కేసుమీద సెప్టెంబర్ కల్లా సిఐడి ని నివేదికనివ్వమని కోరిన కోర్ట్ దాన్ని గోప్యంగా ఉంచమని కూడా ఆదేశించింది.  

తపస్ పాల్ వీడియో బహిర్గతమైన సమయంలో పబ్లిక్ గా లేఖ రాస్తూ ఏదో ఎన్నికల వేడిలా అలా మాట్లాడటం జరిగిందని, అందుకు చింతిస్తున్నానని, క్షమాపణ కోరుతున్నాని ప్రకటించిన తపస్ పాల్ ఇకముందు అలా జరగదని కూడా హామీ ఇచ్చారు.  బేషరతుగా క్షమాపణ కోరటం వలన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ఆ సమయంలో ఆయనను క్షమించేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles