Election promises make it difficult to banks

bank problems with election promises, election promises make bank function difficult, borrowers stopped repayment to banks

Election promises make it difficult to banks as funds are exhausted for making new lendings

మా పని చేసుకోనివ్వరా- నిలదీస్తున్న బ్యాంక్ లు

Posted: 07/21/2014 10:21 AM IST
Election promises make it difficult to banks

మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ మాపని మమ్మల్ని చేసుకోనివ్వండని పరోక్షంగా అంటున్నాయి బ్యాంక్ లు.

అధికారంలో లేనప్పుడు అధికారం కోసం ప్రజలకు హామీలిచ్చి వోట్లు వేయించుకునే విష సంస్కృతి ప్రభావం బ్యాంక్ ల మీద పడుతోంది.  ఎన్నికల సమయంలో ఋణాలను మాఫీ చేస్తామని చెప్పటమే కాకుండా డ్వాక్రా గ్రూపులు, రైతులు వాళ్ళు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించకండి అని సలహా ఇవ్వటం జరిగింది.  దాని వలన సక్రమంగా డబ్బు చెల్లించేవారు కూడా మానేసే సంస్కృతికి బాటలు వేసింది.  

ఋణమాఫీలనేవి రైతులు, డ్వాక్రా గ్రూపులకు, ప్రభుత్వానికి సంబంధించింది.  కానీ అనవసరంగా బ్యాంక్ లు మధ్యలో నలిగిపోతున్నాయని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం అంటోంది.  ఆ సంఘం కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ బ్యాంక్ లకు సంబంధం లేని విషయాల్లో బ్యాంకులు చికాకులను ఎదుర్కుంటున్నాయని, సక్రమంగా చెల్లింపులు చేసేవారు కూడా రాజకీయ నాయకుల హామీలు విని చెల్లించకపోవటం, ఇప్పుడు ప్రభుత్వాలు ఋణాల రిషెడ్యూలింగ్ చెయ్యాలని అంటుంటే బ్యాంక్ లలో నిధులు లేక కొత్త ఋణాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించటం లేదని ఆయన అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles