Two days ap mlas workshop

Two days AP MLAs workshop, Problems of MLAs in attending functions, Union Minister Venkaiah Naidu participates MLAs workshop

Two days AP MLAs workshop held by CM and union Ministers

మమేకమై పనిచెయ్యటంలో ఎమ్మెల్యేల కష్టాలు

Posted: 07/19/2014 11:17 AM IST
Two days ap mlas workshop

ప్రజలతో మమేకమై పనిచెయ్యటం ఎమ్మెల్యేలకు కూడా ఇష్టమే కానీ అందులో ఎన్నో సాధక బాధకాలున్నాయంటున్నారు వాళ్ళు.  ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు జరిగిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఈ విషయాన్ని విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ విశదీకరించారు.  

ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టమేమిటంటే, అన్ని ఫంక్షన్లకూ పిలుస్తున్నారు ఆడపిల్ల పెద్దమనిషి అవటంతో సహా.  ఎలా వెళ్ళాలో తెలియదు, వెళ్ళకపోతే ఊరుకోరు.  ఇదీ ఆయన సమస్య.  ఆయన మాటలకు శిక్షణా శిబిరం కాస్తా హాస్యతరంగాలతో నిండిపోయింది.  

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆ మాటలకు నవ్వుతూ, పెళ్ళి తర్వాత సాయంత్రం జరిగే కార్యక్రమానికి తప్ప అన్నిటికీ ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు.  వీలైతే వెళ్ళండి.  లేదంటే, లేక బాగుండదనుకుంటే గ్రీటింగ్ పంపించండి, లేదా ఎస్ఎమ్ఎస్ లో శుభాకాంక్షలు పంపించండి అని సూచించారు.  

శిక్షణా కార్యక్రమంలో ఎక్కువగా ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎలా కలిసిపోవాలి, తమ పనులను తాము ఎలా చేసుకోవాలి, సభాసమయాన్ని ఎలా సదుపయోగం చేసుకోవాలి, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ప్రస్తుతం ప్రజలకున్న అభిప్రాయాన్ని ఎలా బాగుపరచాలి అన్నదానిలో ఎమ్మెల్యేలకు అవగాహన పెంచటమే లక్ష్యంగా సాగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles