Govt changed but ou students protesting scene unchanged

Govt changed but scene at OU unchanged, Regularization of contract workers opposed by OU students, KCR cabinet approves regularization of contract workers

Govt changed but OU students protesting scene unchanged

పాలన మారినా పద్ధతి మారలేదా?

Posted: 07/19/2014 10:49 AM IST
Govt changed but ou students protesting scene unchanged

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసనుల చేసేవారు, పోలీసులు అడ్డుకుంటే అది తెలంగాణా ప్రాంతవాసులకు వ్యతిరేకమైన చర్యగా భావించేవారు.

రాజకీయంగా సీన్ మారింది.  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.  అయినా ఉస్మానియా విశ్వ విద్యాలయంలో సీన్ మాత్రం అదే.  ప్రభుత్వ వ్యతిరేక పోరాటం, పోలీసులు అడ్డుకోవటం, లాఠీలు విరగటం.

విషయమేమిటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలను క్రమబద్ధీకరించే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకోవటం, దానికి మంత్రిమండలి ఆమోదించటం.  దీనివలన విద్యార్థుల ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని ఓయు విద్యార్థులు ఆందోళన.  

ఆందోళనలు, హింసాత్మక కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో మంచిది కాకపోయినా, ఈ విషయంలో రాజకీయాలతో పనిలేదు, ప్రభుత్వం ఎవరిదైనా మాకు ఒకటే, మేము కేవలం పోరాడేది మా విద్యార్థుల భవిష్యత్తు, హక్కులు, సంక్షేమం కోసమేనని ఆందోళన చేసిన విద్యార్థి సంఘాలను మెచ్చుకోవలసిందే.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles