Kcr decision escalates hyderabad metro cost

kcr decision escalates hyderabad metro cost, hyderabad metro cost may rise 3 times, heritage conservation committee supports kcr metro decision

KCR decision may cause escalation of Hyderbad Metro cost by three times

కెసిఆర్ పట్టుతో మూడురెట్లు పెరగనున్న మెట్రో ఖర్చు

Posted: 07/17/2014 11:48 AM IST
Kcr decision escalates hyderabad metro cost

హైద్రాబాద్ మెట్రో డిజైన్ లో కెసిఆర్ కోరే మార్పులు ఆయా ప్రాంతాల్లో నిర్మాణ వ్యయాన్ని మూడురెట్ల వరకు పెంచనున్నాయి.  పైనుంచి వెళ్ళే మెట్రో నిర్మాణ వ్యయం ప్రతి కిలో మీటర్ కి 200 కోట్లైతే, భూగర్భంలోంచి వెళ్లే మెట్రో వ్యయం కిలోమీటర్ కి 500 నుంచి 600 కోట్ల వరకు అవవచ్చని అంచనా.  ఇప్పటికే హైద్రాబాద్ మెట్రో ప్రస్తుతమున్న డిజైన్ ప్రకారం నిర్మిస్తే దాని వ్యయం రూ.14132 కోట్లు.

హైద్రాబాద్ పురాతన భవనమైన అసెంబ్లీ ప్రాంతంలో మెట్రో లైన్ భూగర్భంలోంచి వెళ్ళాలని కెసిఆర్ పట్టుబడుతున్నారు.  అయితే ఖర్చు పెరగటమొక్కటే కాదని, భూగర్భంలోంచి మెట్రో లైన్ వెయ్యటానికి మరో రెండు సంవత్సరాలు అదనపు కాలం కూడా పడుతుందని మెట్రో అధికారులు అంటున్నారు.  మెట్రో నిర్మాణానికి ఒప్పందం ప్రకారం ప్రస్తుతమున్న కాలపరిమితి మార్చి 2015 కి అయిపోతుంది.  డిజైన్ మార్చినట్లయితే ఆ కాలపరిమితిలో నిర్మాణం చెయ్యటం సాధ్యం కాదని కూడా మెట్రో పనులను నిర్వహిస్తున్న అధికారులు అంటున్నారు.  

ఈ విషయంలో హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ సభ్యులు కెసిఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.  బెంగళూరులా హైద్రాబాద్ లో భూగర్భంలో అంత సులభంగా నిర్మాణం చెయ్యలేమని, అందుకు హైద్రాబాద్ లో భూమిలోపల ఉన్న రాళ్ళు అడ్డువస్తాయని చెప్తున్న మాటలు కుంటిసాకులే అంటున్నారు వాళ్ళు.  అందుకు తగ్గ సాంకేతికతను ఉపయోగించి నిర్మించవలసివుంటుందని, అందుక కావలసిన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని కూడా అంటున్నారు.  

కారిడార్  లో అసెంబ్లీ దగ్గర మార్పులే కాకుండా కారిడార్ 2 లో పడుతున్న సుల్తాన్ బజార్ ప్రాంతంలో కూడా డిజైన్ లో మార్పులు తీసుకుని రావలసివుంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వారం రోజుల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసారు.   దీనితో, కుంటుబడుచున్న మెట్రో పనుల మీద మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, జుబ్లీ బస్ స్టేషన్, ఫలక్ నుమాల మధ్య వెయ్యవలసిన కారిడార్ 2 ని పూర్తిగా రద్దుచేద్దామా అని కూడా ఆలోచనలో పడ్డారు.  

ఈ విషయంలో ఇంకా ఇదమిద్ధంగా ఏ నిర్ణయమూ తీసుకోకపోవటం వలన దీని మీద మాట్లాడటానికి ఎల్ అండ్ టి కానీ హైద్రాబాద్ మెట్రో రైల్ అధికారులు కానీ కామెంట్ చెయ్యటానికి నిరాకరిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles