అది భారతదేశంలోని గ్రామంలో జరిగిన వింత. దాన్ని కేమెరా లెన్స్ వీడియో రూపంలో బంధించింది.
మంచం మీద శిశువు నిద్రిస్తుంటే నాలుగు పాములు పడగవిప్పి ఆ బాలుడికి ఎండపడకుండా చూస్తున్నాయి. భారత దేశంలోని జానపద కథల్లో ఇలాంటి సన్నివేశాలను చెప్పటం జరిగింది. చిన్న పిల్లవాడు సేదతీరుతుంటే ఒక నాగు పాము అతనికి ఎండతగలకుండా పడగవిప్పి ఉండటం చూసిన సాధువు ఆ బాలుడు గొప్ప జాతకుడవుతాడని, మహారాజ యోగం ఉందని చెప్తాడు.
అలాగే కలియుగ దైవంగా భావించే తిరుమలేశుడి కథలో పడగవిప్పిన పాముని కొట్టబొయి వేంకటేశ్వరుని తల మీద కొట్టిన ఉదంతాన్ని చెప్తారు. ప్రకృతితోను, జంతువులతోను మానవుల సహజీవనాన్ని పూర్వకాలం కథలు కథలుగా చెప్పేవారు. మానవులతోపాటుగా జీవించే జంతువులు పక్షులు ఆ మానవులను స్నేహితుల్లా చూసి సాయం చేసేవే కానీ, తిండి పెడుతున్న యజమానిలా చూసేవి కావు. అందువలన మనిషి ఆజ్ఞాపించి సైగలు చెయ్యకుండానే అతని ఉద్దేశ్యాన్ని, అవసరాన్ని కనిపెట్టి సాయం చెయ్యటాన్ని చిన్నప్పటి నుంచీ కథల రూపంలో కానీ సంఘటనల రూపంలో కానీ వింటూ వస్తున్నాం.
ఈ వీడియోలో కూడా ఎవరో ఆజ్ఞాపిస్తే చేసిన సేవలు కావవి. కాకపోతే వాటి కోరలు తీసేసి ఉంటారేమో అంటున్నారు. కోరలు తీసినంత మాత్రాన ఎండకి గొడుగు పట్టినట్టుగా పడగలు విప్పనవసరం లేదు కదా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jul 02 | దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ... Read more
Jul 02 | భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని,... Read more
Jul 02 | రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వంగలవారని తెలిపారు. న్యాయవాదిగా... Read more
Jul 02 | దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్... Read more
Jul 02 | దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల బలపర్చిన అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా హైదరాబాదుకు చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్... Read more