Govt exercises for 24 hours electricity supply

24 hours power for domestic use, govt exercises for 24 hours electricity supply, solar driven pump sets to save power, feeder lines to be changed for domestic supply

govt exercises for 24 hours electricity supply

24 గంటల విద్యుత్ సాధ్యమేనా?

Posted: 07/11/2014 10:22 AM IST
Govt exercises for 24 hours electricity supply

కేంద్ర బడ్జెట్ లో గృహోపయోగం కోసం 24 గంటల విద్యుత్ సరఫరా చెయ్యాలని నిర్ణయం జరిగింది.  దేశం మొత్తం లో ఢిల్లీ, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను నమూనాగా తీసుకుని ఈ మేరకు బడ్జెట్ లో కేటాయింపు జరిగింది.  

అందుకు అయ్యే మొత్తం ఖర్చు కోసం రూ.3440 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయిస్తే, ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే వేసిన అంచనాల ప్రకారం కేవలం విద్యుత్ ఫీడర్లను వేరు చెయ్యటానికే రూ.500 కోట్లు కేటాయించటం జరుగుతోంది.  

గృహోపయోగం కోసం చేసే విద్యుత్ సరఫరాను 24 గంటలు ఇవ్వాలంటే ముందుగా ఆ ఫీడర్ లైన్లను వేరు చెయ్యవలసివుంటుంది.  దానికోసమే కేంద్ర బడ్జెట్ లో 3440 కోట్ల రూపాయలను కేటాయించవలసివచ్చింది.  విద్యుత్ సరఫరాను నియంత్రించాలంటే ఆయా రంగాలకు విద్యుత్ ని అందించే ఫీడర్ లైన్లను వేరు చెయ్యక తప్పదు.  
ఉదాహరణకు నివాస గృహాలు, వ్యవసాయ రంగంలో ఉపయోగం, విఐపి లు నివసించే కాలనీలు, హాస్పిటల్స్, విద్యుత్ తో నడిచే రైళ్ళకి చేసే సరఫరా ఇలా విడివిడిగా కరెంట్ తీగలను వేసినప్పుడే ఆయా తరగతులకు విద్యుత్ ని నియంత్రించటానికి వీలవుతుంది.  

విద్యుత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 24 గంటల విద్యుత్ ని ఇవ్వటానికే కసరత్తులు చేస్తున్నాయి, తప్పకుండా ఇవ్వగలుగుతాము అనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నాయి.  వీటన్నిటికీ గుజరాత్ రాష్ట్రం మోడల్ గా నిలుస్తోంది.

దీనితోపాటుగా వ్యవసాయరంగంలో అయ్యే విద్యుత్ వినియోగాన్ని తగ్గించటానికి కూడ కసరత్తులు ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎక్కువ విద్యుత్ ని తీసుకునే పంపుసెట్ల స్థానంలో సౌరశక్తితో ఉత్పత్తయ్యే విద్యుత్ తో నడిచే పంపు సెట్లను దేశవ్యాప్తంగా నెలకొల్పటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అటువంటి వరకు పంపు సెట్లను దేశం మొత్తంలో ఒక లక్ష వరకు ఏర్పాటు చెయ్యటానికి బడ్జెట్ లో రూ.400 కోట్ల ను కేటాయించటం జరిగింది.  ప్రస్తుతమున్న పంపు సెట్లకు తగినంత విద్యుత్ అందని పక్షంలో నిలిచిపోవటం కానీ లేదా పంపు సెట్లు పాడైపోవటం కానీ జరుగుతోంది.  

చూద్దాం!  భాజపా నినాదం ప్రకారం మంచి రోజులు వస్తాయి అని ఆశిస్తూ, “ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందనా!” అని పాత తెలుగు పాటని పాడుకుందాం!  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles