Congress ministers warns megastar chiranjeevi

Congress ministers warns megastar chiranjeevi, chiranjeevi latest news, chiranjeevi scaring with congress ministers, congress ministers warns chiranjeevi, chiranjeevi news, chiranjeevi not interested to joing bjp party, chiranjeevi with congress leaders, chiranjeevi with congress ministers

Congress ministers warns megastar chiranjeevi

చిరంజీవిని భయపెట్టిస్తున్న కాంగ్రెస్ మంత్రులు

Posted: 07/09/2014 12:56 PM IST
Congress ministers warns megastar chiranjeevi

(Image source from: Congress ministers warns megastar chiranjeevi)

అవును...! మీరు వింటున్నది నిజమే! సినిమాల్లో హీరోగా అందరినీ చెమటలు పట్టించిన మెగాస్టార్, మాజీకేంద్రమంత్రి చిరంజీవి... ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులను చూసి భయపడుతున్నారట! కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకపోయినా.. వారు చెబుతున్నట్లే చిరంజీవి నడుచుకుంటున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే! దీంతో కొంతమంది సీనియర్ నాయకులు ఈ అవమానాన్ని భరించలేక రాజీనామాలు చేస్తే.. మరికొంతమంది మాత్రం ఇతరపార్టలకు జంప్ చేశారు. మరికొంతమంది రాజకీయసన్యాసం చేపట్టారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆ పార్టీలోనే ఎందుకు కొనసాగుతున్నారో ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ.. ఆయన మాత్రం తనను తాను ఒక కాంగ్రెస్ నాయకుడనే చెప్పుకుని తిరుగుతున్నారు.

సహజంగా చెప్పుకోవాలంటే చిరంజీవికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి అస్సలు ఇష్టం లేదట! ఎంత త్వరగా వీలయితే అంత తొందరగా పార్టీని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కొంతమంది చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే... ఆయన తన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వుంటుంది. రాజ్యసభ సభ్యుడు అయివుండి పార్టీ మారితే... పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఖచ్చితంగా బుక్కయిపోవాల్సి వుంటుంది. దాంతో రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వుంటుంది. అందువల్లే చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడకుండా మౌనంగా కాలాన్ని సాగిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఒకవేళ ఈయన బీజేపీ పార్టీవైపుగానీ, ఇతర పార్టీలవైపుగానీ వెళితే.. కాంగ్రెస్ నాయకులు ఈయనపై తిరుగుబాటు బాటపడతారు. తక్షణమే ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడిని చేయాలంటూ సబ్ ఛైర్మన్ వద్ద పిటిషన్ దాఖలు చేసేస్తారు. అది చివరిదాకా తేలేవరకు.. అంటే చిరంజీవి సభ్యత్వం కోల్పోయేంతవరకు వారు తమ పంతాను వదిలిపెట్టరు. దీనిని ముందుగానే గ్రహించిన చిరంజీవి... మరో ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు సమాచారం!

ప్రస్తుతమున్న తరుణంలో ఏ పార్టీ కూడా ఈయనకు ఆహ్వానం పలికే అవకాశం లేదు. బీజేపీవారు ఖచ్చితంగా రాజ్యసభకు పంపలేరు. ఇక ప్రాంతీయ పార్టీలలో ఎంట్రీ ఇస్తే.. జాతీయస్థాయిలో వున్న నాయకుడు... ఏకంగా ఇలా దిగజారిపోయాడేంటి అని అందరు విమర్శలు చేయడం ప్రారంభింస్తారు. దాంతో చిరంజీవికి చేసేదేమీ లేక సినిమాల మీద దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ మంత్రులను చూసి భయపడుతున్నారని ప్రతిఒక్కరు గుసగుసలాడుకుంటున్నారు. చిరంజీవి తెలివిగా వ్యవహరించి రాజీనామా ఇవ్వకపోతే మంచిదని ఆయనకు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles