Cbi officers questioning governor narasimhan about augusta case

cbi officers questioning governor narasimhan about augusta case, cbi officers with governor narasimhan, governor narasimhan latest news, augusta case news, augusta case latest news, governor narasimhan name in augusta case

cbi officers questioning governor narasimhan about augusta case

నరసింహన్ మెడను బిగుస్తున్న అగస్టా ఉచ్చు!

Posted: 07/09/2014 12:13 PM IST
Cbi officers questioning governor narasimhan about augusta case

(Image source from: cbi officers questioning governor narasimhan about augusta case)

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో స్కాములు, కుంభకోణాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే! అందులో ఏ ఒక్కటి ఇంతవరకు పరిష్కారం అవ్వలేదు! దీంతో ఈ స్కాములపై ఎంత వీలైతే అంత త్వరగా చర్యలు చేపట్టి ముగించాలనే నేపథ్యంలో సీబీఐ అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.

అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపటిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో ఎవరైతే సభ్యులుగా పాల్గొన్నారో వారందరినీ ఒక్కొక్కరుగా సీబీఐ అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో పశ్చిమ బెంగాల్, గోవా గవర్నర్లను సీబీఐ విచారించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇద్దరూ గవర్నర్లు రాజీనామా కూడా ఇచ్చేశారు.

ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ను సీబీఐ అధికారులు రాజ్ భవన్ లో ప్రశ్నించారు. గతంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ సందర్భంలో ఐబీ చీఫ్ గా వ్యవహరించిన ఆయన... ఎమైనా సాక్ష్యాధారాలు లభిస్తాయోనన్న కోణంలో సీబీఐవారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చివరగా ఈ కుంభకోణంలో నరసింహన్ ను ఓ సాక్షిగా విచారిస్తూ.. ఆయన వాంగ్మాలాన్ని నమోదు చేసుకున్నారు.

గతంలో కూడా జగన్ కేసులో కొందరిని సాక్షిగా వాంగ్మూలాలను సేకరించిన సీబీఐ అధికారులు... ఆ తరువాత వారిని జైలులో ఊసలు లెక్కబెట్టేలా చేశారు. ప్రస్తుతం నరసింహన్ ను ప్రశ్నిస్తున్న తరుణంలో సాక్షిగా పేర్కొన్న సీబీఐ.. తరువాత ఈయన్ను కూడా జైల్లో వేసి కుమ్మేస్తారేమోనన్న అభిప్రాయాన్ని ప్రతిఒక్కరు వెల్లడిస్తున్నారు. పాపం గవర్నర్... ఈయన భవిష్యత్తు ఏమవుతుందో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles