Governor narasimhan in augusta westland case

governor narasimhan in augusta westland case, augusta westland case, central bureau of investigation on augusta westland case, choppers and helicopters sales and purchases, national security advisor narayana, intelligence bureau incharge ips narasimhan

governor narasimhan in augusta westland case

గవర్నర్ నరసింహన్ రాజీనామా బాట?

Posted: 07/08/2014 06:19 PM IST
Governor narasimhan in augusta westland case

ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు రాజీనామా బాట పట్టే సమయం వచ్చిందని రాజకీయ నేతలు అంటున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు అగష్టా కష్టాలు రానున్నాయి. నరసింహన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు సీబీఐ చూస్తోంది. వీవీఐపీ హెలికాఫ్టర్ల కొనుగోళ్లల్లో ఆయన స్టేట్ మెంట్ కీలకం కానుందని సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న ఇద్దరు గవర్నర్లు ఆ తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అగస్టా కుంభకోణంలో రాజీనామాలు చేసిన ఇద్దరు గవర్నర్లు ఎంకే నారాయణన్ (పశ్చిమ బెంగాల్), బీవీ వాంచూ (గోవా) గతంలో పోలీసు ఉన్నతాధికారులుగా పనిచేశారు. నరసింహన్ కూడా మాజీ పోలీసు ఉన్నతాధికారే. అగస్టా ఒప్పందం సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ గా ఉన్నారు. నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా, వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (యస్పీజీ) హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. గత వారం వారిద్దరినీ సీబీఐ అధికారులు విచారించారు.

ఆ తర్వాత వారిద్దరూ తమ గవర్నర్ గిరీలకు రాజీనామా చేశారు. అగస్టా కేసుకు సంబంధించి సాక్షిగా తమ ముందు హాజరు కావాలని గవర్నర్ నరసింహన్ ను సీబీఐ అధికారులు కోరినట్లు విశ్వసనీయ సమాచారం. 2005లో డీల్ కుదుర్చుకునే టైంలో మీటింగ్ లో ఉన్నారని మాజీ గవర్నర్లు నారాయణన్, వాంచో ల స్టేట్ మెంట్లను సీబీఐ రికార్డ్ చేసింది. రూ.360 కోట్ల లంచాలు కట్టుబెట్టారంటూ వీరిని సీబీఐ వారం రోజుల క్రితం ప్రశ్నించింది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ కూడా హెలికాప్టర్ల కొనుగోలు డీల్ లో ఉండటంతో అతని స్టేట్ మెంట్ కూడా రికార్డు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ త్యాగితో సహా మరి కోనుగోళ్లతో సంబంధం ఉన్న కొంత మంది ఇరోపియన్లపైన కేసులు బుక్ చేసింది. మరో రెండ్రోజుల్లో నరసింహన్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో నరసింహన్ కూడా సీబీఐ విచారణ అనంతరం గవర్నర్ పదవికి రాజీనామా చేస్తారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles