Congress protests against rail budget outside gowdas residence

Congress protests against Rail Budget outside Gowdas residence Congress protests against Rail Budget outside Gowdas residence, railway budget 2014-15, railway budget news, central minister sadanada gowda, sadananda gowda latest news,

Congress protests against Rail Budget outside Gowdas residence

బడ్జెట్ బయటపెట్టి వాతలు పెట్టించుకున్న రైల్వే గౌడ్

Posted: 07/08/2014 04:40 PM IST
Congress protests against rail budget outside gowdas residence

(Image source from: Congress protests against Rail Budget outside Gowdas residence)

కేంద్రమంత్రి సదానందగౌడ విడుదల చేసిన రైల్వే బడ్జెట్ కు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈసారి విడుదల చేసిన రైల్వే బడ్జెట్ పేదలకు అనుకూలంగా లేదని... అదేపనిగా ఎక్కువ ఖర్చులు చేయించేదిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఇందులో భాగంగానే కొంతమంది కాంగ్రెస్ నేతలు సదానంద గౌడ ఇంటిముందు నినాదాలు చేస్తూ, విమర్శలు చేశారు. అందులో ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే మరీ దురుసుగా ప్రవర్తించారు. ఆయన ఇంటి ప్రహరీగోడ మీదున్న ఆయన నేమ్ ప్లేట్ ని తీసుకుని, చిందులు వేస్తూ తన కాలికింద వేసుకుని తొక్కేశారు. అక్కడున్న నగరవాసులు కూడా కాంగ్రెస్ నాయకులకు మద్దతు తెలుపుతూ ఆయన ఇంటిముందు నినాదాలు చేశారు.

అలాగే కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడయిన రాహుల్ గాంధీ కూడా ఈ రైల్వే బడ్జెట్ పై స్పందించారు. ‘‘ఈసారి విడుదల చేసిన రైల్వే బడ్జెట్ ఎంతో నిస్సారమైనది. ఇది రైల్వే బడ్జెట్ లా కాకుండా.. ఒక సర్వీస్ బడ్జెట్ లా కనిపిస్తోంది. కేరళ, బెంగాళ్ వంటి వెనుకబడిన రాష్ట్రాలను వదిలేశారు. ఇది పేదలకు అనుకూలం లేని బడ్జెట్’’ అని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడే ఇలా వ్యవహరిస్తే.. భవిష్యత్తులో పేదలకు ఎలాంటి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు.

మరో కాంగ్రెస్ నాయకుడైన వీరప్ప మొయిలీ కూడా దీనిపై స్పందిస్తూ ఘాటు కామెంట్లు చేశారు. ‘‘ఈ రైల్వే బడ్జెట్ లో అసలు జాతీయతనే కనిపించడం లేదు. ఇదేదో ఒక టోకెన్ పద్ధతిలా కనిపిస్తోంది. కేవలం సేఫ్టీ, ఫాస్ట్ వంటి ఇతర విషయాల గురించి మాట్లాడటం రైల్వే బడ్జెట్ గురించి వివరించినట్టు కాదు. రైల్వే బడ్జెట్ కోసం కేటాయించాల్సిన అంత డబ్బు ఎక్కడుంది..? ఎలా దీనిని సమర్థించాలి..?’’ అంటూ విమర్శలు జల్లులు కురిపించారు.

నరేంద్రమోడీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ తొలి బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ బడ్జెట్ తో ఎలాంటి న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పటయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జోనల్ స్టేషన్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే విధంగా వుందని ఆయన వెల్లడించారు.

మమతా బెనర్జీ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ... ‘‘ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ పశ్చిమ బెంగాల్ అస్సలు పట్టించుకోలేదని’’ ఆమె అన్నారు. ఇందులో బెంగాల్ కు మొండిచేయి చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. ‘‘కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో బెంగాల్ కు అస్సలు ఏమీ కేటాయించలేదు. కేంద్రం బెంగాల్ కు రిక్తహస్తం చూపించింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles