పోలీసును చూడలంటే.. పోలీస్ స్టేషన్ కు వెళ్లితే సరిపోతుంది. పోలీసు చూడాలని చెప్పి , మర్డర్ చేసి జైలు వెళ్లితే పోలీసులను చాలా దగ్గర చూడొచ్చు అనే విధంగా.. దావూద్ ఇబ్రహిం ని పట్టుకోవటం కోసం పోలీసులు కొత్త ప్రయోగం చేపట్టారు.ఇప్పుడు భారత నిఘా వర్గాలు .. ఫేస్ బుక్ పై ఆధారపడ్డాయి. దావూద్ సోదరి హసీనా ముంబయిలో కన్నుమూసిన నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఈ మాఫియా డాన్ కుటుంబీకుల కార్యకలాపాలపై నిఘా సంస్థలు కన్నేశాయి.
ముఖ్యంగా దావూద్ కుమార్తె మహ్రూఖ్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. అల్లుడు జునైద్ మియాందాద్ (పాక్ క్రికెటర్ మియాందాద్ కుమారుడు)తో పాటు పలువురు కుటుంబ సభ్యుల ఫేస్ బుక్ ఖాతాలను ఇంటలిజెన్స్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 2010లో మహ్రూఖ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ కామెంట్ ద్వారా నిఘా వర్గాలు ఓ క్లూను పట్టుకోగలిగాయి. లాహోర్ లో భర్తతో కలిసి ఉండే మహ్రూఖ్... కరాచీలో ఉంటున్న అమ్మా, నాన్నా అందరినీ మిస్సవుతున్నానని ఆ పోస్ట్ లో పేర్కొంది.
దీంతో, దావూద్ కరాచీలోనే ఉంటున్నాడని భారత నిఘా సంస్థలు నిర్ధారించుకున్నాయి. 2010 వరకు దావూద్ కుటుంబ సభ్యలు అందరూ ఫేస్ బుక్ లో క్రియాశీలకంగా ఉండేవారని, అయితే, ఆ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ప్రైవసీ నిబంధనలు మారడంతో వారందరూ గప్ చుప్ అయిపోయారని, ప్రొఫైల్స్ తీసేశారని అధికారులు తెలిపారు. అయితే దావూవ్ పట్టుకోవటం ఎలా అనేది భారత నిఘా వర్గలకు పెద్ద తలనొప్పిగా మారింది.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more