India get illitery record in the worldwife by unesco

India get illitery record in the worldwife by unesco, illitery children in india, illitery people india, unesco, education for all global monitoring report of 2015, unesco survey, india gets another worst record, unesco latest news, indian poor children, india government

India get illitery record in the worldwife by unesco

భారతదేశం చెత్తదని మరోసారి నిరూపించుకుంది!

Posted: 07/07/2014 12:20 PM IST
India get illitery record in the worldwife by unesco

(Image source from: India get illitery record in the worldwife by unesco)

మన భారతదేశానికి అప్పుడప్పుడు కొన్ని అరుదైన గౌరవాలు దక్కుతాయి. అవి కూడా చెప్పుకోదగినవి కావు.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా కొన్ని పరమచెత్త గౌరవాలు దక్కుతుంటాయి. ఇప్పుటికే భారతదేశం ఎయిడ్స్ లో రెండో స్థానంలో, శుభ్రతలో 87వ స్థానంలో వుండగా... ఇప్పుడు మరో చెత్త గౌరవాన్ని మూటగట్టుకుంది.

యునెస్కో సంస్థ నిర్వహించే ఎడ్యుకేషన్ ఫల్ ఆల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా 2015వ సంవత్సరంలో వెల్లడించిన నివేదిక ప్రకారం... ప్రపంచంలోనే భారతదేశం నిరక్షరాస్యత శాతం ఎక్కువగా వుందని తేల్చిపారేసింది. సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న మన భారతదేశంలో ప్రస్తుతం వెల్లడయిన నివేదిక లెక్కలమేరకు... దాదాపు 14 లక్షలమంది చిన్నారులు బడికి వెళ్లకుండా బయటే అడుక్కుతింగు మగ్గుతున్నారని తేలింది. అదికూడా 6-11 సంవత్సరాల మధ్య వున్న పిల్లలే వుండడం విశేషం!

ప్రతి సంవత్సరం యునెస్కోవారు నిర్వహించే ఈ నివేదికలో యావత్తు ప్రపంచం మొత్తం ఇంకా బడికి వెళ్లని పిల్లలు దాదాపు 5.78 కోట్లుగా వున్నారని తెలుపుతోంది. ఈ నివేదిక గణాంకాల ప్రకారం... ప్రపంచదేశాల్లో నిరక్షరాస్యులుగా ఎక్కువమంది పిల్లలున్న తొలి ఐదు దేశాల జాబితాలో మన భారత్ కూడా ఒకటి. ఇది మన భారత్ పరిస్థితి! ఇదే మన భారతదేశం సాధించిన మరో చెత్త రికార్డ్!

అదే భారతదేశానికి పొరుగునే వున్న నేపాల్ దేశం మాత్రం ఈ విషయంలో చాలా మెరుగ్గా వుంది. మనదేశం కంటే మెరుగైన రీతిలో చర్యలు చేపట్టి... ఏకంగా 99 శాతం మంది పిల్లల్ని బడిలో చదువుకునేలా చేసింది. కేవలం 1 శాతం పిల్లలు మాత్రమే అక్కడే నిరక్షరాస్యులుగా తేలారని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే బురుండి వంటి చిన్న దేశం కూడా 94 శాతం వరకు చిన్నపిల్లలను బడిలో చేరేలా చర్యలు చేపట్టి శెభాష్ అనిపించుకుంది. 2005లో కేవలం 54 శాతం మాత్రమే వెల్లడయిన ఈ లెక్కలు... ఇప్పుడు ఆ దేశం స్కూల్ ఫీజులను ఎత్తివేయడం ద్వారా ఈ విధంగా మంచి ఫలితాలను సాధించగలిగింది యునెస్కో నివేదికలు పేర్కొన్నాయి.

ఇక భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ లో కూడా దాదాపు 10 లక్షలమంది పిల్లలు చదువు అభ్యసించకుండా బయటే తమ కాలాన్ని గడుపుతున్నారని యునెస్కో అధికారులు తెలుపుతున్నారు. ఆయా దేశాల్లో వున్న ప్రభుత్వాలు, రాజకీయనేతలు పిల్లల మీద సరిగ్గా దృష్టి సారించకపోవడం... సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పిల్లలు ఇలా నిరక్షరాస్యులుగా మారుతున్నారని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బోకోవా ఆరోపించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles