Digvijay siingh fasting for farmers in madhya pradesh

digvijay siingh fasting for farmers in madhya pradesh, digvijay singh latest news, digvijay singh fasting for farmers, digvijay singh comments on nda government, digvijay singh comments on narendra modi, narendra modi latest news, digvijay singh comments on narendra modi, narendra modi latest news, digvijay singh twitter account, digvijay singh news, narendra modi twitter

digvijay siingh fasting for farmers in madhya pradesh

రైతులకోసం కాంగ్రెస్ కామరాజ దీక్ష!

Posted: 07/07/2014 11:42 AM IST
Digvijay siingh fasting for farmers in madhya pradesh

(Image source from: digvijay siingh fasting for farmers in madhya pradesh)

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీలో వున్న కొంతమంది నాయకుల కామకథలు బయటపడిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా వారిలో దిగ్విజయ్ సింగ్ గారి కామకథ చాలా విచిత్రమైనది. తనకంటే 25 సంవత్సరాల చిన్నది అయిన టీవీ యాంకర్ తో నడిపిన ఘాటు ప్రేమకథ యావత్తు భారతదేశాన్నే షాక్ కు గురిచేసింది. ఇది జరిగిపోయిన కథ!

తాజాగా డిగ్గీరాజా పార్టీ బలోపేతం కోసం తిరిగి కొన్ని ప్రత్యేకమైన ట్రిక్కులు ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు మీడియాకంట పడకుండా కొన్నాళ్లవరకు కనుమరుగైన డిగ్గీరాజా.. ఇప్పుడు హఠాత్తుగా రైతుల కోసం నిరసన దీక్షలు ప్రారంభించారు. అవును... మీరు వింటున్నది నిజమే..! 67ఏళ్ల ముసలివాడు రైతుల కోసం నిరాహారదీక్ష చేయడానికి సిద్ధపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన దిగ్విజయ్ సింగ్... తన సొంత రాష్ట్రంలో వున్న రైతులకు నష్టం కలిగిందని, వారికి జరిగిన నష్టపరిహారం కోసం పోరాడుతానంటూ ముందుకు వచ్చారు. మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం నుంచి వారంరోజుల వరకు నిరాహార దీక్ష చేయనున్నారని సమాచారం! ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. మధ్యప్రదేశ్ లో వున్న బీపేజీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ఎన్టీయే ప్రభుత్వం విఫలమైందని నిరసనగా డిగ్గీరాజా దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన తన ట్విటర్ లో పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇంతవరకు ఎన్టీయే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని... ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించి మోసపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయితే గతంలో అధికారం వున్నప్పుడు రైతుల సంక్షేమానికి అవసరమయ్యే పథకాలను దిగ్విజయ్ ఎందుకు అమలు చేయలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈయన మీద ఘాటుగానే స్పందించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles