Babu and kcr big fight on governor rule in andhrapradesh

babu and kcr big fight, Telangana CM KCR vs AP CM Chandrababu, governor rule in andhrapradesh, Governor, State Bifurcation Draft Bill.

babu and kcr big fight on governor rule in andhrapradesh, Telangana CM KCR vs AP CM Chandrababu

గవర్నర్ పెత్తనం పై బాబు-కేసిఆర్ కొత్త ఫైట్ !

Posted: 07/07/2014 08:41 AM IST
Babu and kcr big fight on governor rule in andhrapradesh

కొత్త సరికొత్త వివాదం మళ్లీ బుస్సులు కొడుతుంది. నిన్నటి వరకు, ఆంద్రప్రదేశ్, తెలంగాణాల మద్య నీటి వివాదాలు, ఉద్యోగుల వివాదాలు, ఆస్తుల ఫైట్ జరుగుతూనే ఉన్నాయి. కానీ కొత్తగా తెరపైకి గవర్నర్ పెత్తనం రెండు రాష్ట్రాల సిఎంలు రణరంగంలోకి దూకుతున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు మళ్లీ చర్చనీయాంశంగా మారుతోంది. కొత్త విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ శాంతి భద్రతలు, పోలీసు పోస్టింగులు, బదిలీలన్నీ గవర్నర్ చేతికే వెళ్లనున్నాయి.

దీంతో రెండు రాష్ట్రాల్లో మళ్లీ విభజన మంటలు సెగలు కక్కుతున్నాయి. విభజన చట్టంలో సవరణతో కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రగిలిస్తోంది. ఉమ్మడి రాజధానిలోని శాంతి భద్రతల అంశం.. ఉమ్మడి రాజధానిలో తనవిధులేంటో తెలపాలని కేంద్రానికి గవర్నర్ లేఖ పంపడంతో ఈ వివాదానికి తెరలేచింది. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. హైదరాబాద్ లోని పోలీసులపై పెత్తనం అంతా గవర్నర్ చేతికే అప్పచెప్పాలని, వారి పోస్టింగులు, బదిలీల బాధ్యతలు ఆయనకే ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించినట్లు సమాచారం.

governor-rule-in-andhrapradesh

అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. పోలీసులపై గవర్నర్ కు అధికారాలేంటని ప్రశ్నిస్తూ, ఇది రాజ్యాంగ విరుద్దమంటూ కేంద్రంపై మండిపడింది. ముసాయిదా ప్రతిని కేంద్రానికి తిరిగి పంపిస్తూ ఘాటుగా లేఖరాసింది. ఉమ్మడి రాజధానిలో పాలనాపరమైన నిర్ణయాలు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసుశాఖ ఆధునీకరణ తదితర బాధ్యతలన్నీ తెలంగాణ ప్రభుత్వానిదేనని దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కులుండవిని లేఖలో పేర్కొంది. కేవలం ప్రత్యేక సందర్భాల్లో, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పరిష్కారం చేసే బాధ్యత గవర్నర్ పై ఉంటుందని తెలిపింది.దీనిని విభజన చట్టంలోని సెక్షన్-8 చెప్తోందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర హక్కులను కాలరాసేవిధంగా చట్ట సవరణకు సిద్ధమవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిలోని శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలన్నీ గవర్నర్ కు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడికి లేఖ రాశారు. అవసరమైతే చట్టాన్ని మార్పుచైసైనా గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు భద్రత, ఆస్తులకు రక్షణ చర్యల విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు కమిషనర్లతో సహా, డిసిపిలు, ఇతర అధికారుల నియామకం మొత్తం గవర్నర్ పరిధిలోనే ఉండాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

అయితే ఉమ్మడి రాజధానిలోని శాంతిభత్రల అంశం ఇప్పుడు కొత్త వివాదాలకు దారితీస్తోంది. కేంద్రం పంపిన లేఖతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అంతేకాక ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి...

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles