Narendra modi brother sombhai modi clarrifies about modi marriage issue

narendra modi brother sombhai modi clarrifies about modi marriage issue, narendra modi latest news, narendra modi marriage life, somabhai modi speaks about narednra modi marriage life, narendra modi with his wife, narendra modi left his wife after marriages, secret behind why narendra modi leave his wife

narendra modi brother sombhai modi clarrifies about modi marriage issue

ఈ కారణంతో మోడీ భార్యను వదిలేశాడట!

Posted: 07/04/2014 05:50 PM IST
Narendra modi brother sombhai modi clarrifies about modi marriage issue

(Image source from: narendra modi brother sombhai modi clarrifies about modi marriage issue)

నేడు భారతదేశ ప్రధాని అయిన నరేంద్రమోడీ... నాడు తన భార్యను ఎందుకు వదిలేశారని యావత్తు భారతదేశం సందేహాన్ని వ్యక్తం చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీవారు లేవదీసిన ఈ ప్రశ్నకు అప్పట్లో మోదీ కూడా సరియైన సమాధానం ఇవ్వలేదు. ‘‘దేశ ప్రజలకోసం, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు మాత్రమే తాను దృష్టి సారించాను. నా వ్యక్తిగత జీవితం గురించి ఏమీ చెప్పుకోదల్చుకోలేదు’’ అని మోడీ అడపాదడపా సమాధానమే ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా ఇదే విషయం గురించి నరేంద్రమోడీ తమ్ముడు అయిన సోంభాయ్ మోడీ అందరి సందేహాలను దూరం చేస్తూ ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం వారు చిన్న వయస్సులోనే పిల్లలకు వివాహం చేసేవారని చెప్పిన ఆయన... నరేంద్రమోడీ వివాహం కూడా పిన్న వయస్సులోనే జసోదాబెన్ తో ఎంతో బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేశారని ఆయన చెప్పారు. అయితే మోడీ దీనిని జీర్ణించుకోలేక తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి... చరమ గీతం పాడారని గురువారం విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దేశం కోసం సేవ చేయాలనే స్వామి వివేకానందుడు బోధనలతోనే మోడీ పెరిగి పెద్దవాడయ్యాడని... దేశ సేవ కోసమే తన వైవాహిక జీవితాన్ని త్యజించి ముందుకు నడిచారని ఆయన స్పష్టం చేశారు. చివరగా... మోడీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను ఆరాతీయాలనే ప్రయత్నంతో అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని ఆయన సూచించారు.

2001 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అఫిడవిట్ లో వివామానికి సంబంధించిన అంశాన్ని నాలుగుసార్ల వరకు వెల్లడించని మోడీ... ఇటీవలే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం తనకు వివాహం అయినట్లు ధృవీకరించారు. అయితే వివాహం అయిన కొద్ది కాలానికి మాత్రమే మోడీ తన భార్య జసోదాబెన్ తో విడిపోయానని ఆయన ప్రకటించిన విషయం అందరికి విదితమే! కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు ఎక్కువ కావడం వల్ల మోడీ తన వైవాహిక జీవితం గురించి వెల్లడించక తప్పలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles