(Image source from: NDA govt plans to hike the praise of kirosene soon)
భారతదేశ ప్రజలపై మోడీ ప్రభుత్వం పగబట్టినట్టు కనిపిస్తోంది. తనకిష్టమొచ్చిన విధంగా ధరలను పెంచిపారేస్తోంది. సగటు సామాన్య మానవుడి జీవన విధానాన్ని కఠినంగా మార్చేస్తోంది. దేశ ప్రజలు ఏ నమ్మకంతో అయితే మోడీ ప్రభుత్వాన్ని గెలిపించారో... దానికి విరుద్ధంగా వారి నమ్మకాలను వమ్ము చేస్తూ దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలను పెంచుతూ... విమర్శల బారిన పడుతోంది. ఇటువంటి చర్యలను కూడా ఎందుకు తీసుకుంటుందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారిపోతోంది.
మొన్నటికి మొన్న గత 20 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైల్వే ఛార్జీలను భారీగా పెంచి పారేసింది మోడీ ప్రభుత్వం. ప్రయాణికుడి ఛార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాల ఛార్జీలను 6.2 శాతం పెంచేసింది. దీని ప్రభావం అటు ఇనుమల మీద కూడా చూపుతోంది. టన్నుకు 400 రూపాయల చొప్పున ధరలను పెంచేశారు. అయితే దీనిమీద స్పందించిన మోడీ ప్రభుత్వం... దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలంటే కొంచెం త్యాగం చేయడంలో తప్పు లేదంటూ... నీతులు చెప్పుకొచ్చి జనాలను టోపీలు తొడిగించేసింది.
ఇప్పుడు తాజాగా వంటగ్యాస్, కిరోసిన్ ధరలను కూడా భారీగా పెంచడానికి మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మరోసారి దేశ ప్రజలపై భారీ వడ్డన వేసేందుకు ముందుకు వస్తోంది. ఇందులో వంటగ్యాస్ సిలిండర్ర ధరను రూ.250, కిరోసిన్ ధరను రూ.4 నుంచి 5 రూపాయల వరకు పెంచనున్నట్టు కిరీట్ పరీఖ్ కమిటీ సిఫార్సుల మేరకు మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయం తీసుకోనున్నట్టు తాజా సమాచారం!
కొన్నిరోజుల కిందటే రాయతీయేతర సిలిండర్ పై రూ.16.48పైసలు... అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి ఇంత భారీమొత్తంలో పెంచడంపై దేశప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అభివృద్ధి పేరుతో నరేంద్రమోడీ సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కొంతమంది నేతలు అప్పుడే విమర్శలు గుప్పిస్తారు. అధికారం వచ్చిన నెలకే ఇలా వ్యవహరిస్తున్నారంటే.. రానురాను దేశానికి గడ్డు పరిస్థితి వస్తుందని తమ మనసులోని భావాలను వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more